దిల్ రాజు టైటిల్.. పోలీసులు హర్టయ్యారు

Update: 2016-04-14 05:57 GMT
సినిమా తీసేటపుడు ఇది జనాలకు నచ్చుతుందా లేదా అన్నది తర్వాత ఆలోచించొచ్చు. ముందు ఇది ఎవరి మనోభావాలైనా దెబ్బ తీస్తుందా అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జనాలు మరీ సెన్సెటివ్ అయిపోయారు. ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ల మనోభావాలు దెబ్బ తినేస్తాయంతే. చివరికి చాలా దృఢమైన మనస్తత్వం ఉన్నవాళ్లని పేరున్న పోలీసులకు సైతం ఓ టైటిల్ చూడగానే మనోభావాలు దెబ్బ తినేశాయి. ఆ టైటిల్ మరేదో కాదు.. పోలీసోడు.

దిల్ రాజు తెలుగులోకి అనువదించిన విజయ్ సినిమా ‘తెరి’కి ‘పోలీసోడు’ అనే టైటిల్ పెట్టడం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తోంది పోలీసు అధికారుల సంఘం. ఈ పేరు పోలీసుల్ని అగౌరవపరిచేలా.. వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి - నగర విభాగం అధ్యక్షుడు ఎన్.శంకర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఈ సినిమాను విడుదల చేయడానికి దిల్ రాజు హడావుడిగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో.. పేరు మార్చాల్సిందే అని ఆ సంఘం పట్టుబడుతోంది. దీనికి సంబంధించి దిల్‌ రాజుకు నోటీసులు కూడా ఇచ్చినట్లు సమాచారం.

ఐతే ఈ టైటిల్ మీద అభ్యంతరాలుంటే.. పది రోజుల కిందట ఈ పేరు ప్రకటించినపుడే ఆ విషయాన్ని నిర్మాతకు చెప్పాల్సింది. ప్రమోషన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి.. విడుదలకు సిద్ధమవుతుండగా ఒకట్రెండు రోజుల ముందుకొచ్చి ఇలా డిమాండ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అయినా ‘పోలీసోడు’ అనే టైటిల్ మరీ అంత అగౌరవపరిచేలా ఉందన్నది కూడా ఆలోచన రేకెత్తించే విషయమే.
Tags:    

Similar News