#సుశాంత్.. కుట్ర‌ కుట్ర‌కోణం ఏదైనా?

Update: 2020-06-15 13:00 GMT
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంలో ఎదైనా కుట్ర కోణం దాగి ఉందా? అన్న విచార‌ణ సాగుతోంది. ఇప్ప‌టికే ముంబై పోలీస్ అత‌డిది ఆత్మ‌హ‌త్య అని పోస్ట్ మార్టమ్ ధృవీక‌రించిన‌ట్టు వెల్ల‌డించారు. అయినా ఈ కేసును కాస్త లోతుగానే ప‌రిశోధిస్తున్న‌ట్టు తాజా స‌మాచారం అందుతోంది.

సుశాంత్ చాలా చిన్న వ‌య‌సులోనే త‌ల్లిని కోల్పోయి డిప్రెష‌న్ లోకి వెళ్లాడు. ఆరేళ్లుగా దానికి సంబంధించి మెడిసిన్ తీసుకుంటున్నాడు. ఒత్తిడికి ముంబైలో ఓ సైక్రియాటిస్టు వ‌ద్ద చికిత్స పొందుతున్నాడు. పోలీసులు వాటిని ప‌రిశీలించారు. ఇంత‌వ‌ర‌కూ ఓకే కానీ.. అంత‌కుమించి ఇంకేదైనా తెలుసుకోవాల్సిన‌ది ఉందా? అన్న‌ది పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.

ముఖ్యంగా సుశాంత్ స్నేహితురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి.. స్నేహితుడు మహేష్ శెట్టి పై విచార‌ణ సాగుతోంది. అలాగే అత‌డి మేనేజ‌ర్ ని ప్ర‌శ్నిస్తున్నార‌ని తెలిసింది. వీళ్ల‌తో పాటు రెగ్యుల‌ర్ గా సుశాంత్ కి టచ్ ‌లో ఉండే బంధువులు.. స్నేహితులను కూడా ప్రశ్నించి ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు పోలీసులు తన దర్యాప్తును వేగవంతం చేశారు. ఆ క్ర‌మంలోనే స్నేహితుల ఫోన్ లు.. ఇత‌ర ఎల‌క్ట్రానిక్ సామాగ్రిని పోలీసులు స్వాధీన‌ప‌రుచుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ కేసులో కుట్ర కోణం ఏదైనా ఉందా? ఆర్థిక వ్య‌వ‌హారాల్లో లోతైన విష‌యాలేవైనా ఉన్నాయా? అన్న‌ది విచారిస్తున్నారు.

సుశాంత్ మొబైల్ నుంచి కాల్స్ ఎవ‌రెవ‌రెకి వెళ్లాయి? అన్న కోణాన్ని విచారించ‌గా.. మరణానికి ముందు సుశాంత్ తన స్నేహితుడు.. టెలివిజన్ నటుడు మహేష్ శెట్టికి కాల్ చేశారు. అయితే రాత్రి ఫోన్ ఎత్తకపోవడంతో మాట్లాడలేక‌పోయార‌ట‌. కానీ వేకువ ఝామున కాల్ ప్ర‌య‌త్నిస్తే లిఫ్ట్ చేయ‌లేద‌ట‌. అయితే అప్పటికే సుశాంత్ మరణించి ఉంటారు. అందుకే నా కాల్ ఎత్తలేద‌న్న సంధిగ్ధ‌త‌ను మధు శెట్టి మీడియా ముందు వ్య‌క్తి చేశారు. ఇక సుశాంత్ త‌న‌తో ఎంతో క్లుప్తంగా మాట్లాడాడ‌ని .. వారం రోజులుగా డిప్రెష‌న్ తో ఉన్నాన‌ని త‌న‌తో చెప్పాడ‌ని.. తాను ఇంటికి ర‌మ్మ‌న్నాన‌ని సుశాంత్ సోద‌రి వెల్ల‌డించారు. ర‌క‌ర‌కాలుగా విచారించ‌డ‌మే గాక‌.. సుశాంత్ తో ఆర్థిక వ్య‌వ‌హారాల్లో ఎవ‌రెవరు కీల‌కంగా ఉన్నారు? అన్న కోణంలోనూ ద‌ర్యాప్తు సాగిస్తున్నారు.
Tags:    

Similar News