తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ విభిన్నమైన సినిమాలతో సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం పొలిటికల్ నేపథ్యంలో ఉన్న సినిమాలు కూడా చాలా ఎక్కువగానే రాబోతున్నట్లు గా తెలుస్తోంది. ముఖ్యంగా మెగా నందమూరి హీరోలు చేయబోయే తదుపరి సినిమాలు మొత్తం కూడా అదే తరహాలో ఉండనున్నట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా పాలిటిక్స్ ఉండబోతున్నాయి. అందులో జనజాగృతి అనే పార్టీ నేతగా మెగాస్టార్ కనిపించబోతున్నాడు.
మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న మాస్ యాక్షన్ సినిమాలో కూడా రాజకీయ అంశాలు ఉంటాయి. అందులో పొలిటికల్ డైలాగ్స్ కూడా గట్టిగానే ఉంటాయని తెలుస్తోంది. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కలయికలో రాబోయే భవదీయుడు భగత్ సింగ్ కూడా పొలిటికల్ సెటైర్స్ గా తెరపైకి రాబోతోంది.
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో వస్తున్న సినిమాలో కూడా పాలిటిక్స్ అనేది ప్రధానమైన అంశం అని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది.
రామ్ చరణ్ శంకర్ కలయికలో రానున్న సినిమాల్లో కూడా పొలిటికల్ టచ్ గట్టిగానే ఉండబోతున్నట్లు సమాచారం. అందులో రామ్ చరణ్ ఒక ప్రభుత్వ ఉద్యోగిగానే కాకుండా ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా కూడా మారతాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరికొందరు మీడియం రేంజ్ హీరోలు కూడా అదే తరహాలో పాలిటిక్స్ సంబంధించిన కథలను సెలెక్ట్ చేసుకోవడం విశేషం.
యువ హీరో నితిన్ నుంచి రాబోయే తదుపరి చిత్రం మాచర్ల నియోజకవర్గం కూడా పూర్తి స్థాయిలో పాలిటిక్స్ నేపద్యంలోనే రాబోతోంది. ఇందులో ఎన్నికల అధికారి గా నితిన్ కనిపించబోతున్నాడు. మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న రంగ రంగ వైభవంగా సినిమాల్లో కూడా కొంత పొలిటికల్ పాయింట్స్ హైలెట్ కాబోతునట్లు సమాచారం. మరి ఈ హీరోల రాజకీయ వేషాలు బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు క్లిక్ అవుతాయో చూడాలి.