బన్నీ హీరోయిన్.. భలే నిర్ణయం

Update: 2017-12-24 06:12 GMT
బోలెడంత డబ్బు వచ్చి చేతుల్లో పడుతున్నపుడు ప్రజా ప్రయోజనం గురించి ఏమీ ఆలోచించరు చాలామంది సెలబ్రెటీలు. ముఖ్యంగా ఫెయిర్నెస్ క్రీంలు.. వెయిట్ లాస్ పిల్స్ లాంటి వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని.. ఆ కాన్సెప్ట్స్ మంచివి కావని అందరూ ఆలోచించరు. ఐతే కంగనా రనౌత్ లాంటి ఒకరిద్దరు మాత్రం ఫెయిర్నెస్ క్రీంలను ప్రమోట్ చేయడానికి నో చెప్పి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ‘దువ్వాడ జగన్నాథం’ భామ పూజా హెగ్డే ఇలాంటి బోల్డ్ డెషిషనే తీసుకుంది. బరువు తగ్గించే పిల్స్ కు ప్రచారం చేయడానికి ఆమె నో చెప్పింది. ఓ సంస్థ ఆమెకు భారీ పారితోషకం ఇచ్చి ఈ పిల్స్ ప్రమోట్ చేయాలని కోరిందట. ఐతే ఈ నాజూకు భామ అందుకు నో చెప్పేసిందట.

ఇది మంచి డీల్ అయినప్పటికీ పూజా వద్దనుకుందట. వెయిల్ లాస్ పిల్స్ అనేవి ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచివి కావని.. బరువు తగ్గడానికి కసరత్తులు చేయడం.. సరైన డైట్ తీసుకోవడమే సరైన మార్గాలని.. అలా కష్టపడి కాకుండా ఎలా బరువు తగ్గినా ఒంటికి మంచిది కాదని.. జనాల ఆరోగ్యానికి ప్రమాదం అయిన ఇలాంటి పిల్స్ ను తాను ప్రమోట్ చేయనని తేల్చి చెప్పేసిందట పూజ. ఈ విషయమై పూజ టీం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. పూజా తన ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుందని.. వ్యాయామం.. యోగా ద్వారానే ఆమె నాజూగ్గా ఉంటోందని.. జనాలు కూడా అవే మార్గాల్ని అనుసరించాలని ఆమె చెబుతుందని.. తాను పాటించని విషయాల్ని ఇంకొకరిని అనుసరించమని ఆమె చెప్పాలనుకోవట్లేదని పూజా ప్రతినిధులు ఓ ప్రకటన ఇచ్చారు. ఈ విషయంలో పూజాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే కదా.
Tags:    

Similar News