స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్` అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రం ఈపాటికే పట్టాలెక్కాల్సి ఉన్నా అనూహ్యంగా `పుష్ఫ` ప్రాజెక్ట్ కి లాకవ్వడంతో బన్నీ ఐకాన్ ని పక్కనబెట్టారు. కారణం ఏదైనా ఐకన్ ఆలస్యమవుతోంది. ఇటీవలే వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాక బన్ని ఐకాన్ కి లైన్ క్లియరైంది.
`ఐకాన్` ఎలా ఉండబోతోంది? అన్న ప్రశ్నకు .. ఇది ఓ స్టైలిష్ ఎంటర్ టైనర్ అని వేణు శ్రీరామ్ ముందుగానే హింట్ ఇచ్చేసారు. ఆన్ స్క్రీన్ పై బన్నిని స్టైలిష్ గా ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. సినిమాకి కావాల్సిన కమర్శియల్ అంశాల్ని జొప్పిస్తూ కొత్త తరహా కథ కథనాలతో తెరకెక్కించనున్నామని తెలిపారు.
తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో బన్నీ కి జోడిగా ఏకంగా ఇద్దరు స్టార్ హీరోయిన్లకు ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలేస్తున్న రష్మిక మందన.. పూజాహెగ్డే లను లాక్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఇద్దరు భామలతోనూ మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు గనుక జరిగితే బన్నీ తో రొమాన్స్ చేసే గాళ్స్ కన్ఫమ్ అయినట్లే. ప్రస్తుతం బన్నీ-రష్మిక `పుష్ఫ`లో జంటగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఐకాన్ సెట్స్ కు తీసుకెళ్లాలని సన్నాహాలు చేస్తున్నారు.
వరుస పాన్ ఇండియా చిత్రాలు:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప` చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకుంటున్నారు. ఆ తర్వాతా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలకు ప్లాన్ సాగుతోంది. బన్ని నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం తెలుగు-తమిళం-మలయాళం- హిందీ లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత కూడా బన్ని క్యూలో కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తో పాటు ఏ.ఆర్ మురుగదాస్ లాంటి దర్శకులు ఉన్నారు. ఆ ఇద్దరూ పాన్ ఇండియా అప్పీల్ ఉన్న స్టార్ డైరెక్టర్స్. జాతీయ స్థాయిలో అసాధారణ ఫాలోయింగ్ ఉంది. ఇక మురుగదాస్ హిందీ చిత్రసీమలోనూ తిరుగులేని విజయాలు సాధించారు. అమీర్ ఖాన్ తో గజినీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తీయడమే గాక సోనాక్షి సిన్హా.. అక్షయ్ కుమార్ లాంటి స్టార్లతో రీమేక్ చిత్రాలని తెరకెక్కించి హిట్లు కొట్టారు.
నిజానికి చాలా కాలం క్రితమే మురుగదాస్ బన్నీకి లైన్ వినిపించారని కథనాలొచ్చినా అప్పట్లో ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. కానీ ఇప్పుడు పుష్ప పూర్తి చేశాక మురుగదాస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు శ్రీరామ్ వేణుతో ఐకాన్ పాన్ ఇండియన్ కేటగిరీనే. కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తదుపరి సలార్ ముగించి బన్నీకి టచ్ లోకి వస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొరటాలతోనూ బన్ని సినిమా చేయాల్సి ఉంది.