బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సుపరిచితురాలైన ముద్దుగుమ్మ పూనం పాండే. ఈ అమ్మడు తన హాట్ ఫొటోలు మరియు వీడియోలతో సోషల్ మీడియాలో కుమ్మేస్తూ ఉంటుంది. ఈమె చేసే పోస్ట్ లు మరియు వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఉంటాయి. అలాంటి సోషల్ మీడియా క్రేజ్ ను దక్కించుకున్న పూనం పాండే తాజాగా మరో బాలీవుడ్ స్టార్ అయిన శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రాపై లైంగిక వేదింపుల కేసును పెట్టడం ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
రాజ్ కుంద్రా కంపెనీని పూనం పాండే తనకు ఒక యాప్ కావాలంటూ సంప్రదించిందట. అందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అప్పటి నుండి అన్ నౌన్ నెంబర్స్ నుండి పూనం పాండే కు కాల్స్ వస్తున్నాయట. చాలా అసభ్యంగా మాట్లాడటంతో పాటు.. అసభ్యంగా మెసేజ్ లు చేస్తూ వేదిస్తున్నారట. ఈ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది.
ఎప్పుడైతే రాజ్ కుంద్రా కంపెనీలో నా కాంటాక్ట్ డిటైల్స్ ను ఇచ్చానో అప్పటి నుండే నాకు అవాంచిత కాల్స్ వస్తున్నట్లుగా ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజ్ కుంద్రాను విచారించేందుకు సిద్దం అయ్యారు. ఈ విషయంపై శిల్ప శెట్టి మరియు రాజ్ కుంద్రాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కొందరు మాత్రం పూనం పబ్లిసిటీ కోసం ఈ కేసు పెట్టి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.