స్టార్‌ డైరెక్టర్‌ కు పాజిటివ్‌.. క్రేజీ మూవీ షూటింగ్‌ కు బ్రేక్‌

Update: 2021-04-18 04:30 GMT
కరోనా సెకండ్‌ వేవ్‌ టాలీవుడ్‌ వర్గాల వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ తో పాటు పలువురు ఫిల్మ్ స్టార్స్‌ కరోనా బారిన పడ్డారు. పవన్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మరో వైపు సినీ వర్గాల వారు పలువురు కరోనా బారిన పడ్డారు. షూటింగ్‌ లు జోరుగా సాగుతున్న సమయంలో ఇలా జరగడంతో షూటింగ్‌ లు కొన్ని ఆగిపోతున్నాయి. తాజాగా ఎఫ్‌3 సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. మైసూర్‌ లో రేపు జరగాల్సిన షూటింగ్ ను దర్శకుడు అనీల్‌ రావిపూడికి కరోనా పాజిటివ్ వల్ల వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల వాయిదా పడ్డ మొదటి పెద్ద సినిమాగా ఎఫ్‌ 3 నిలిచింది. వెంకటేష్ మరియు వరుణ్‌ తేజ్ లు కలిసి చేస్తున్న ఎఫ్‌ 3 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమా ముగింపు దశకు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది. ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెల్సిందే. దర్శకుడు అనీల్‌ రావిపూడికి కరోనా పాజిటివ్‌ రావడం వల్ల కనీసం రెండు వారాల పాటు షూటింగ్‌ కు బ్రేక్‌ పడే అవకాశం ఉంది. అయినా కూడా సినిమా విడుదల విషయంలో ఎలాంటి డౌట్‌ అక్కర్లేదని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

ఎఫ్ 2 సూపర్‌ హిట్‌ తో ఎఫ్ 3 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎఫ్‌ 3 కథ పూర్తిగా డబ్బు చుట్టు తిరుగుతుందని అంటున్నారు. ఇక ఎఫ్‌ 3 లో వెంకీ మరియు వరుణ్‌ లతో పాటు సునీల్ కూడా జత కలిసి కామెడీని పండించబోతున్నాడు అంటున్నారు. వీరితో పాటు రాజేంద్ర ప్రసాద్‌ ఎప్పటిలాగే తనదైన శైలితో మెప్పించేందుకు సిద్దంగా ఉన్నాడు. మొత్తానికి ఎఫ్‌ 3 సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని నమ్మకంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయంలో దర్శకుడు అనీల్ రావిపూడికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యి సినిమా షూటింగ్‌ క్యాన్సిల్‌ అవ్వడం కాస్త నిరుత్సాహంను కలిగిస్తుంది.
Tags:    

Similar News