సాహో షూటింగ్ అనుకున్నంత వేగంగా సాగనప్పటికి అభిమానులు దీని మీద చాలా హై ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. బాహుబలి తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా కావడంతో నేషనల్ మీడియా కూడా దీని మీద ఆసక్తిగా ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు. ఇన్ సైడ్ సోర్సెస్ నుంచి వచ్చిన టాక్ ప్రకారం ఇందులో ప్రభాస్ టూ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడట. అప్పుడెప్పుడో వచ్చిన అర్జున్ జెంటిల్ మెన్ - గత ఏడాది వచ్చిన అల్లు అర్జున్ డిజే తరహాలో బయట ఒక పాత్ర లోపల ఒక పాత్ర పోషిస్తూ విలన్ల వేటలో ఉంటాడని తెలుస్తోంది. ఒక పాత్ర దొంగ తరహాలో కనిపిస్తే మరో పాత్ర పోలీస్ ఇన్ ఫార్మర్ గా ఉండవచ్చు అనేది వార్తల సారాంశం. ఇది పుకారు కావడానికి అవకాశం ఉన్నా ఫాన్స్ మాత్రం ప్రభాస్ ని ఇలా గతంలో చూడలేదు కాబట్టి బాగుంటుంది అని ఆశిస్తున్నారు.
ప్రస్తుతం దుబాయ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న సాహో ఈ ఏడాది విడుదల కావడం అనుమానంగానే ఉంది. వంద కోట్లకు పైగా రూపొందుతున్న సినిమా కావడం. సిజె వర్క్ కూడా చాలా ప్రాధాన్యం ఉండటం వల్ల షూటింగ్ పూర్తయ్యాక కూడా కనీసం మూడు నాలుగు నెలల టైం కావాల్సి వచ్చేలా ఉంది. అందుకే యూనిట్ డెడ్ లైన్ పెట్టుకోకుండా వర్క్ చేస్తున్నట్టు తెలిసింది. దర్శకుడు సుజిత్ స్క్రీన్ ప్లే మీద ఎక్కువ శ్రద్ధ పెడుతూ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసినట్టు వార్త. నీల్ నితీష్ - జాకీ ష్రాఫ్ - మందిరా బేడి ఇలా బాలీవుడ్ గ్యాంగ్ ఇందులో పెద్దదే ఉంది. హీరొయిన్ శ్రద్ధా కపూర్ కు కూడా ఇదే మొదటి తెలుగు సినిమా. శంకర్ ఎహ్సాన్ లాయ్ సంగీత ద్వయం సాహోతోనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది. ఇన్ని విశేషాలు ఉన్నాయి సరే ఇంత వరకు డ్యూయల్ రోల్ చేయని ప్రభాస్ రెండు కోణాల్లో కనిపిస్తాడు అనగానే ఫాన్స్ మాత్రం అప్పుడే ఊహలకు రెక్కలు తొడిగేస్తున్నారు.