ఈశ్వర్ 20 ఏళ్లకు 'వర్షం' ఏంటి భయ్యా?

Update: 2022-11-12 13:30 GMT
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు పూర్తి అయ్యింది. ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్‌ 20 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్‌ మీడియాలో సందడి వాతావరణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు 20 ఏళ్ల వేడుక జరుపుకునే విధంగా థియేటర్ల వద్ద హంగామా చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఈశ్వర్ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వర్షం సినిమాను తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రీ రిలీజ్ చేయడం జరిగింది. ఏదో ప్రత్యేక షో అన్నట్లుగా కాకుండా రెండు మూడు రోజుల పాటు వర్షం సినిమాను తెలుగు రాష్ట్రాల్లో వందలాది థియేటర్స్ లో ప్రదర్శించాలని భావించారు. అభిమానుల నుండి తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుందని.. సాదారణ ప్రేక్షకులు కూడా వర్షం చూస్తారని బయ్యర్లు భావించారు.

వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ లో మొదటి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ మూవీ అనే విషయం అందరికి తెల్సిందే. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ 20 ఇయర్స్ ఇండస్ట్రీ సందర్భంగా రీ రిలీజ్ కు ప్లాన్ చేశారు. తీరా చూస్తే బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా ఈ సినిమా పడింది అనడంలో సందేహం లేదు.

ప్రభాస్ అభిమానులు వర్షం రీ రిలీజ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున సందడి చేశారు. కొన్ని థియేటర్ల వద్ద మొదటి ఆట బాగానే ఆడింది. జనాలతో కిటకిటలాడింది. కానీ తర్వాత ఆట నుండి ఆ థియేటర్ల వద్ద కూడా జనాలు లేక పోవడంతో షో లు క్యాన్సిల్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చిందట.

అయినా ఈశ్వర్ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకుంటే వర్షం సినిమాను రీ రిలీజ్ చేయడం ఏంటి భయ్యా అంటూ సోషల్‌ మీడియాలో కొందరు ప్రభాస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో వర్షం సినిమా ను రీ రిలీజ్ చేసిన వారిది తప్పు అన్నట్లుగా ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎంత సూపర్‌ హిట్‌ సినిమా అయినా కూడా ప్రభాస్ వర్షం సినిమాను భారీ ఎత్తున రీ రిలీజ్ చేయడం అనేది తప్పుడు నిర్ణయంగా కొందరు మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బిల్లా మరియు రెబల్‌ సినిమా లు రీ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు వర్షం రీ రిలీజ్ చేసి నవ్వుల పాలు అయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News