హాలీవుడ్ హీరోలకి ఏ మాత్రం తగ్గకుండా ఉండే టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ ప్రభాస్. మనోడికి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది ఆ లుక్సే కదా! ‘బాహుబలి’ కోసం ఐదేళ్లు కష్టపడిన ప్రభాస్... ఇప్పుడు ‘సాహో’ కోసం బాగానే చెమటోరుస్తున్నాడు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుగుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి కొన్ని స్టిల్స్ బయటికొచ్చాయి.
ఆ ఫోటోల్లో బ్లాక్ కలర్ జీన్స్- బ్లాక్ కలర్ టీ షర్ట్- బ్లౌజర్ ధరించి యమా స్టైలిష్ లుక్కులో అదిరిపోయాడు యంగ్ రెబల్ స్టార్. బైక్ కూడా ప్రభాస్ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయించారేమో అనేంతలా మనోడితో మ్యాచ్ అయిపోయింది. ఈ ఫోటోలను చూస్తుంటే ‘వన్- నేనొక్కడినే’ సినిమాలో మహేష్ బాబు ఛేజింగ్ సీన్స్ గుర్తుకురావడం పక్కా. ఇద్దరూ టాలీవుడ్ అందగాళ్లే కదా మరి. ప్రస్తుతం దుబాయ్ లో క్లైమాక్స్ కి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉంది చిత్ర బృందం. ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ ఫైట్స్ కోసం ఏకంగా 30 కోట్లు ఖర్చుపెడుతున్నారని టాక్.
ఈ స్టిల్స్ చూస్తుంటేనే ‘సాహో’ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సైంటిఫిక్- యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందీ చిత్రం.