గత ఐదేళ్ళలో టాలీవుడ్ స్టార్ హీరోల మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో.. మన హీరోలపై అధిక బడ్జెట్ పెట్టడానికి ఫిలిం మేకర్స్ ముందుకు వస్తున్నారు. అయితే అందరి హీరో చిత్రాలపై ఖర్చు చేసే బడ్జెట్ ఒక విధంగా ఉంటే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై పెట్టుబడి మాత్రం మరో విధంగా ఉంటోంది.
'బాహుబలి' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రభాస్.. ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. 'బాహుబలి 2' మూవీ బాక్సాఫీస్ వద్ద 1800 కోట్లకు పైగా రాబట్టడంతో.. డార్లింగ్ స్టామినాని దృష్టిలో పెట్టుకొని ఎంత బడ్జెట్ అయినా ఖర్చు చేయడానికి నిర్మాతలు రెడీగా ఉంటున్నారు.
మిగతా టాప్ హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం 200 - 300 కోట్లు ఖర్చు చేయడానికి ఫిల్మ్ మేకర్స్ ముందుకు వచ్చారంటే అది పెద్ద విషయంగానే భావించాలి. కానీ ప్రభాస్ విషయానికొస్తే.. ఆయన నటించే ప్రతి సినిమాపై భారీగా 400 కోట్లకు పైగా ఖర్చు చేయడానికి నిర్మాతలు ఏమాత్రం వెనుకాడటం లేదు.
'బాహుబలి' తర్వాత రెండు పెద్ద సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించకపోయినా.. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాల బడ్జెట్ లో కాస్ట్ కటింగ్స్ ఏమీ చేయలేదు. ఎలాగూ కేవలం నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో తమ వాటాలను తిరిగి పొందుతున్నారు కాబట్టి.. ఎంతైనా ఖర్చు చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉంటున్నారని తెలుస్తోంది.
'సాహో' 'రాధేశ్యామ్' వంటి రెండు సినిమాలు ప్లాప్ అయినా.. నిర్మాతలు నష్టపోలేదు. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వాళ్ళు సేఫ్ జోన్ లోకి వచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలపై నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారంటే కారణం కూడా అదేనని అంటున్నారు.
సాధారణంగా ఒక హీరో రెండు బ్యాక్ టూ బ్యాక్ భారీ ప్లాప్స్ అందుకుంటే.. స్టార్ డమ్ తో పాటుగా క్రేజ్ తగ్గిపోతుంది. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. అందుకే పాన్ ఇండియా స్టార్ కు అంత డిమాండ్ ఉంది. అందుకే 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారు.
ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో నటిస్తున్న 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరువుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మైథలాజికల్ డ్రామా రిలీజ్ కాబోతోంది.
అలానే 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో కలిసి చేస్తున్న 'సలార్' మూవీ సెట్స్ మీద ఉంది. ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ వచ్చే సమ్మర్ లో విడుదల కానుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' అనే పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్ గా నిలిచే అవకాశం ఉంది.
ఇదే క్రమంలో సందీప్ వంగాతో 'స్పిరిట్' అనే మరో పాన్ ఇండియా మూవీ లైన్ లో పెట్టారు. ఇందులో ప్రభాస్ తన కెరీర్ లోనే తొలిసారిగా పోలీసాఫీసర్ గా కనిపించనున్నారని టాక్. ఏదేమైనా ప్రభాస్ తన తదుపరి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్స్ అందుకోవాలని డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి వీటిల్లో ఏవేవి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తాయో చూడాలి.