ఇది ప్రభాస్‌ రేంజ్‌.. పది సెకన్ల లీక్ వీడియో ఇండియా ట్రెండ్‌

Update: 2021-10-19 07:03 GMT
బాహుబలి సినిమా తో ప్రభాస్‌ పాన్ ఇండియా సూపర్ స్టార్‌ గా మారిపోయాడు. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు దక్కించుకున్న ఆ సినిమా తర్వాత సాహో సినిమా తో బాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింతగా దగ్గర అయ్యాడు. ఇక ప్రస్తుతం వరుసగా బాలీవుడ్‌ లో సినిమాలు చేస్తూ అక్కడ స్టార్‌ గా దూసుకు పోతున్నాడు. కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. కేజీఎఫ్‌ ను మించిన యాక్షన్ ఎంటర్‌ టైనర్ గా సలార్ ఉంటుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. సలార్‌ సినిమా చిత్రీకరణ సమయంలో సెట్స్ నుండి పిక్స్ ఎప్పటికప్పుడు లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా పది సెకన్ల వీడియో సలార్ నుండి లీక్ అయ్యింది.

సలార్ షూటింగ్ లో భాగంగా ప్రభాస్‌ చేతిలో గన్స్ పట్టుకుని అలా ముందుకు కదులుతూ కాల్చుతూ ఉన్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రభాస్ కటౌట్ ను వెండి తెరపైనే కాకుండా ఎక్కడ చూసినా కూడా ఎలా చూసినా కూడా అభిమానులు ఫిదా అవుతూనే ఉంటారు. లీక్ అయిన ఆ పది సెకన్ల వీడియో ను నెటిజన్స్ తెగ షేర్‌ చేస్తున్నారు. ఆ చిన్న వీడియో ట్విట్టర్ ఇండియాలో టాప్ ట్రెండ్ లో నిలిచింది. ఉన్నట్లుండి సలార్ ట్విట్టర్ ట్రెండ్‌ లో టాప్‌ లో నిలవడంతో అంతా కూడా అవాక్కయ్యారు. అసలు ఏం జరుగుతుందని అనుకుంటున్న సమయంలోనే అనూహ్యంగా సలార్‌ వీడియో కోట్ల మందికి చేరిపోయింది.

ప్రభాస్.. శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించినంత వరకు పది సెకన్ల వీడియో అయినా కూడా సినిమా పై అంచనాలు ఎంతగా ఉన్నాయి.. ప్రభాస్ ను జనాలు ఏ స్థాయిలో అభిమానిస్తున్నారు అనేది చెప్పకనే చెప్పింది. ఇది ప్రభాస్‌ రేంజ్ అంటూ అభిమానులు గల్లా ఎత్తుకునేలా ఈ వీడియో చేసింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సలార్ పది సెకన్ల వీడియోనే ఈ రేంజ్ లో ట్రెండ్‌ అయితే ఫస్ట్ లుక్ టీజర్ లేదా గ్లింమ్స్ ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యోనో ఊహించుకుంటేనే బాబోయ్ అన్నట్లుగా యాంటీ ఫ్యాన్స్ కు గుండెల్లో గుబులు మొదలు అయ్య అవకాశాలు ఉన్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సలార్‌ ను వచ్చే ఏడాది సమ్మర్‌ లో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.




Tags:    

Similar News