విశ్వ‌న‌టుడితో 22ఏళ్ల త‌ర్వాత ప్ర‌భుదేవా..!

Update: 2020-12-30 08:30 GMT
దాదాపు 22 ఏళ్ల క్రితం విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తో క‌లిసి ప‌ని చేశారు ప్ర‌భుదేవా. మ‌ళ్లీ ఇన్నాళ్టికి ఈ క‌ల‌యిక సాధ్య‌మ‌వుతోంద‌న్న‌ది ఆస‌క్తిని పెంచుతోంది. ప్రభుదేవా- కమల్ హాసన్ రెండు దశాబ్దాల తరువాత `విక్రమ్` మూవీ కోసం తిరిగి కలుసి ప‌ని చేయ‌నున్నారు. 1998లో కమల్‌–ప్రభుదేవా `నవ్వండి లవ్వండి` అనే చిత్రంలో నటించారు. అది కామెడీ ఎంటర్‌టైనర్‌. తాజా చిత్రం `విక్రమ్‌` పొలిటికల్‌ థ్రిల్లర్‌. త్వరలో షూటింగ్‌ ఆరంభించి తమిళనాడు ఎన్నికల ముందు విడుద‌ల చేస్తార‌ట‌.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించ‌నున్న ఈ మూవీ ప్రీప్రొడ‌క్ష‌న్ పనులను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కమల్ హాసన్  - లోకేష్ కనగరాజ్ కాంబినేష‌న్ లో తొలి మూవీ ఇది. ఫహద్ ఫాసిల్ ప్రధాన విల‌న్ పాత్ర‌ పోషిస్తుండగా.. ప్రభుదేవా కీలక పాత్ర పోషిస్తున్నట్లు భావిస్తున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్ ‌లో అధికారికంగా ప్రారంభించాలని భావించారు. అయితే మ‌హ‌మ్మారీ వ‌ల్ల‌ ప్రాజెక్ట్ ‌పై క్లారిటీ రాలేదు.

ప్ర‌స్తుతం విజయ్ `మాస్టర్` విడుదల కోసం లోకేష్ క‌న‌క‌గ‌రాజ్ ఎదురు చూస్తున్నాడు. త‌దుప‌రి క‌మ‌ల్ - ప్ర‌భుదేవాల విక్ర‌మ్ ప‌ని మొద‌లు పెడ‌తాడ‌ట‌. మరోవైపు కమల్ హాసన్ త్వరలో `భారతీయ 2` చిత్రీక‌ర‌ణ‌ను  తిరిగి ప్రారంభించనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా క‌మ‌ల్ తిరిగి ఆరంగేట్రం చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న `ఇండియన్ 2`లో సిద్ధార్థ్- రకుల్ ప్రీత్ సింగ్- బాబీ సింహా- కాజల్ అగర్వాల్ - ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Tags:    

Similar News