స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో 'రాధే' సినిమాను తెరకెక్కిస్తున్న ప్రభుదేవా మరి కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు. ప్రభుదేవా దర్శకత్వంలో నటించేందుకు బడా హీరోలు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈ సమయంలోనే ప్రభుదేవా తాను హీరోగా కూడా రెండు సినిమాలు చేస్తున్నాడు. మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సినిమా చేస్తున్నాడు. రాధే మూవీ ఈ ఏడాది ఈద్ కు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాధే మూవీ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విక్రమ్' లో ప్రభుదేవా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ సినిమాతో పాటు మంజా పై రాఘవన్ ఒక సినిమాను రూపొందించే పనిలో ఉన్నాడు. ఆ సినిమాలో ప్రభుదేవా కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక మరో యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ దర్శకత్వంలో కూడా ప్రభుదేవా నటించబోతున్నాడు.
దర్శకుడిగా రాధే సినిమా ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా నటుడిగా చేస్తున్న సినిమాలు వచ్చే ఏడాది వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. దర్శకుడిగా కూడా ఈయన మరో సినిమాను ఈ ఏడాది పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఏ స్టార్ కూడా ఇలా నటుడిగా దర్శకుడిగా ఇంత బిజీ లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.