ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం అనే సామెతని మన కథానాయికలు కూడా బాగానే ఒంటబట్టించుకొన్నారనిపిస్తోంది. ఏ హీరోతో కలిసి నటిస్తే ఆ హీరోని తెగ పొగిడేస్తుంటారు. కన్నడ కస్తూరి ప్రణీత కూడా ఇప్పుడు అదే పనిచేస్తోంది. అత్తారింటికి దారేదిలో నటిస్తున్నంతవరకు పవన్ కళ్యాణ్ ని ఒక రేంజిలో పొగిడింది. పవన్ సూపర్బ్ - ఆయన వ్యక్తిత్వం అదుర్స్ అంటూ ఆకాశానికెత్తేసింది. ఇప్పుడేమో బ్రహ్మోత్సవంలో నటిస్తోంది కాబట్టి మహేష్ జపం చేయడం మొదలుపెట్టింది. దాదాపు ఐదారేళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ప్రణీత ఇప్పటిదాకా నేర్చుకోలేని విషయాల్ని మహేష్ తో జోడీ కట్టగానే నేర్చేసుకుందట. ఆ విషయాన్ని స్వయంగా చెప్పింది. ప్రణీత చెప్పిన ఆ మాటలు విన్న జనాలు ఇది మరీ విడ్డూరం లేమ్మా అని నవ్వేసుకుంటున్నారు.
మహేష్ సెట్ లో తన పని తాను చేసుకుపోవడం తప్ప ఇతరత్రా విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు. ఏదైనా అవసరమైతే దర్శకులే చెబుతారు కదా అని తోటి నటీనటులు కూడా ఎలాంటి సలహాలు ఇవ్వడు. ఇక పక్కన నటిస్తున్నవాళ్లతో మరీ చనువు పెరిగిందనుకున్నప్పుడు మాత్రం ఏదైనా ఒకట్రెండు మాటలు చెబుతుంటాడంతే. కానీ ప్రణీత మాత్రం మహేష్ నుంచి అది నేర్చుకొన్నా, ఇది నేర్చుకొన్నా అని చెబుతుండటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కానీ ప్రణీత మాత్రం ``కొందరిని చూస్తుంటూనే కొన్ని విషయాలు అర్థమవుతాయి. అలా మహేష్ ని చూస్తున్నప్పుడు నాకు చాలా విషయాలు తెలిసొచ్చాయి`` అని చెబుతోంది.