అత్తారింటికి దారేది చిత్రంలో నటించింది ప్రణీత శుభాష్. అందులో సమంత కంటే అందంగా ఉందని మనసు దోచిందని మార్కులు ఎక్కువే వేశారు. అంతకుముందు ఎన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు పవర్ స్టార్ పవన్ సరసన నటించాక తెచ్చుకుంది. అయినా అదేమీ కెరీర్ పరంగా హెల్ప్ ఆలేదు. అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించినా అవేవీ హిట్లు కొట్టలేదు. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రణీత కెరీర్ అక్కడా అంతంత మాత్రమే.
ఇక అందరిలాగే సోషల్ మీడియాల్లో ఈ అమ్మడు అభిమానులకు టచ్ లో ఉంది. తాజాగా కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ప్రణీత చేసిన ఓ పోస్టింగ్ ఫ్యాన్స్ ని హీటెక్కించింది. అయితే ఈ అమ్మడు షేర్ చేసిన సోషల్ మీడియా మెసేజ్ కాస్త అతిగా అనిపించింది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అదేదో భాజపాలోనో శివసేన పార్టీలోనో చేరినట్టుగా ఈ అమ్మడు హిందూత్వకు వకాల్తా పుచ్చుకున్నట్టే అనిపించింది.
హిందూ ధర్మం మంచిని భోధించిన ప్రతిసారీ వాళ్లు (పాశ్చాత్యులు) నవ్వుకున్నారు. కానీ అవే ధర్మాలు మన ప్రజల్ని కాపాడుతున్నాయి.. అనే అర్థం వచ్చేట్టు మాట్లాడింది. షేక్ హ్యాండ్ తో పని లేకుండా నమస్కారంతో విష్ చేసినప్పుడు.. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్లు చేతులు కడుక్కున్నప్పుడు... శవాన్ని దహనం చేసి తిరిగి వచ్చినప్పుడు స్నానమాచరిస్తే... గోవుల్ని జంతువుల్ని పూజిస్తే.. శుచి శుభ్రం పాటిస్తే వాళ్లంతా నవ్వుకున్నారు. కానీ అవే హిందూ సనాతన ధర్మాలు మనల్ని కాపాడుతున్నాయి! అంటూ ఎంతో ఉద్వేగంగానే సందేశాన్ని ఇచ్చింది. అయితే ఇదంతా హిందూత్వను ఎంకరేజ్ చేసేందుకా? అన్నట్టుగా అనిపించింది. కాస్త ప్రణీత అతి చేసిందేమోనన్న సందేహం వ్యక్తమైంది. అయితే హిందూ ధర్మం గొప్పదే కానీ అలాగని ఇతర మతాల ఫార్ములాస్ కరెక్ట్ కాదనే అర్థంలో మాట్లాడడం సరికాదేమో! మతం ఏదైనా మంచి విషయాలే చెబుతాయి. చెడును ఎవరూ భోధించరు.. అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఇలా కోవిడ్ 19 వైరస్ నే తన స్వలాభం కోసం సొంత ప్రచారం కోసం వాడేస్తోందా? అన్న సందేహం కలుగుతోంది. రమణ అవతార- హంగామా 2- భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రాల్లో ప్రణీత నటిస్తోంది.