కన్నడ సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నది. అక్కడ స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, వాళ్ల ప్రభావం మిగతా ఇండస్ట్రీలపై అంతగా ఉండేది కాదు. వాళ్ల సినిమాలు .. వాళ్ల పరిధిలోనే తమ జోరును కొనసాగిస్తూ ఉండేవి. నిన్నమొన్నటి వరకూ ఇదే పరిస్థితి ఉండేది. అయితే ఎప్పుడైతే ' కేజీఎఫ్' బయటికి వచ్చిందో, అప్పటి నుంచి కన్నడ సినిమాలను గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. కన్నడలో ఎంతటి టాలెంట్ ఉన్నవారు ఉన్నారనే విషయం వాళ్లకి అర్థమైంది. అలాంటి సినిమాకి సీక్వెల్ గా 'కేజీఎఫ్ 2' రూపొందింది. ఈ నెల 14న ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రెస్ మీట్ లో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ .. "అందరికీ నమస్కారం .. ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే ఒక తెలుగు సినిమాను రిలీజ్ చేస్తున్న ఫీల్ ను ఇచ్చారు. ఈ సారి మరింత బాధ్యతను తీసుకున్నాను . తెలుగులో డబ్బింగ్ వ్యవహారాలు చూసుకోవడానికి కూడా ఒక మంచి టీమ్ ను సెట్ చేయడం జరిగింది.
వాళ్లంతా ఎంతో కష్టపడి మంచి అవుట్ పుట్ ను తీసుకొచ్చారు. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. మొదటి నుంచి కూడా దిల్ రాజు గారు ఈ సినిమాను ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు ఎవరు పాన్ ఇండియా సినిమా చేసినా ముందుగా రాజమౌళిగారి పేరు చెప్పాలి.
ఇంతకుముందు పాన్ ఇండియా అనే ఒక దారి చాలా ఇరుకుగా ఉండేది. ఆ దారిని రాజమౌళి గారు ఎక్స్ ప్రెస్ హైవే చేశారు. నాకు మాత్రమే కాదు .. పెద్ద సినిమాలు తీసే ప్రతి ఒక్కరికి ఆయన స్ఫూర్తినే. ఈ సినిమాకి చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకున్నారని అందరూ అంటున్నారు. కథకి తగినట్టుగానే వాళ్లను తీసుకోవడం జరిగింది. ప్రతి పాత్రకు గల ప్రత్యేకతను బట్టే వాళ్లను సెట్ చేయడం జరిగింది. సంజయ్ దత్ గారు .. రవీనా టాండన్ గారు .. ప్రకాశ్ రాజ్ గారు .. రావు రమేశ్ గారు చాలా బాగా చేశారు. రావు రమేశ్ గారు ఎంతో కష్టపడి కన్నడలో డబ్బింగ్ చెప్పారు.
ఇక ప్రకాశ్ రాజ్ గారు మలయాళంలో కూడా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆయన అంకిత భావం చూసి నేను షాకయ్యాను. నా టెక్నీకల్ టీమ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లు లేరంటే నేను లేను. శ్రీనిధి శెట్టి పాత్రకి ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుంది.
నా రాకింగ్ స్టార్ యశ్ గురించి చెప్పాలంటే, ఆయనను మేము కరెక్ట్ వే లోనే ప్రెజెంట్ చేశామని అనుకుంటున్నాము. మీ అందరి హృదయాల్లో యశ్ కి కొంచెం ప్లేస్ ఇవ్వండి. ఈ నెల 14వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చారు .