తెలుగు ప్రేక్షకులకు ‘పెళ్లి’ చిత్రంతో పృథ్వీరాజ్ సుపరిచితుడు అయిన విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత ఎన్నో చిత్రాల్లో కార్యరెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా నటించిన ఈయన కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ఒకానొక సమయంలో ఈ జీవితాన్ని ముగించేయాలనేంతగా డిప్రెషన్ లోకి వెళ్లి పోయాడట. ఆ విషయాన్ని స్వయంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ పేర్కొన్నాడు. తన జీవితంలో జరిగిన సంఘటనలు మరెవ్వరి జీవితంలో కూడా జరగవద్దని తాను కోరుకుంటానని ఈ నటుడు అంటున్నాడు.
నేను 18 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాను. నాకు అమీర్ పేట్ లో ఒక అపార్ట్ మెంట్ లో ప్లాట్ ఉంది. 14 వ అంతస్తు నుండి దూకి చనిపోవాలని అనుకున్నాను. నేను చనిపోవాలని భావించిన సమయంలో నా అసిస్టెంట్ ఫోన్ చేసి తినడానికి ఏమైనా తీసుకు రావాలా అంటూ అడిగాడు. వద్దని చెప్పిన నేను- అతడు ఒక రోజు సెలవు అడిగితే ఇచ్చాను. ఆ తర్వాత అతడితో కొద్ది సమయం మాట్లాడిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంను విరమించుకున్నట్లుగా పృథ్వీరాజ్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం సినిమా కెరీర్ పరంగా పర్వాలేదు అన్నట్లుగా ఉందని, నేను ‘ఎన్టీఆర్’ చిత్రంలో నటిస్తున్నాను. దర్శకుడు క్రిష్ ఒక మంచి పాత్రను నాకు ఇచ్చారు. ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతో ఆయనతో ఒక్క సీన్ లో అయినా నటించాలని కోరుకున్నాను. కాని ఆ అవకాశం నాకు దక్కలేదు. ఇప్పుడు ఆయన సినిమాలో చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి పాత్రను చేస్తున్నందుకు తృప్తిగా ఉందని పృథ్వీరాజ్ అన్నాడు.