స్టార్ కమెడియన్ పృథ్వీరాజ్ గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలతోనే కాకుండా తన వ్యాఖ్యలతో కూడా ఫేమస్ అయ్యారు. 'ఖడ్గం' సినిమాలో 'థర్టీ ఇయర్స్.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ' అనే డైలాగుతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన పృథ్వీరాజ్ తర్వాత వచ్చిన 'పోకిరి' 'దూకుడు' 'గబ్బర్ సింగ్' లాంటి సినిమాలతో స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో 'లౌక్యం' సినిమాలో ఆయన పోషించిన బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్ర కూడా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కూడా పాలుపంచుకున్న పృథ్వీరాజ్ గత ఎన్నికలలో వైయస్సాఆర్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే భక్తి చానల్ ఎస్వీబీసీకి చైర్మన్ గా వ్యవహరించారు పృథ్వీరాజ్. అయితే మహిళా ఉద్యోగినితో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడాడంటూ ఓ ఫోన్ కాల్ రికార్డిండ్ వైరల్ అవడంతో.. స్వచ్చంధంగా తన పదవికి రాజీనామా చేసారు.
ఇదిలా ఉండగా ఇటీవల ఓ వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు పృథ్వీరాజ్. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆ ఇంటర్వ్యూ ప్రోమోలో కొన్ని వివాదాస్పద కామెంట్స్ కూడా చేసారని తెలుస్తోంది. పృథ్వీరాజ్ మాట్లాడుతూ ప్రతి దాని మీద హైప్ క్రియేట్ చేసే సోషల్ మీడియాని ఛానల్స్ ని బాయ్ కాట్ చేస్తే సమాజంలో ప్రశాంతత నెలకొంటుందని చెప్పుకొచ్చారు. ఇక సదరు యాంకర్ 'ఇండస్ట్రీలో బండ్ల గణేష్ లాంటి సెలబ్రిటీలకు కూడా కరోనా సోకింది కదా' అని మాట్లాడగా.. 'బండ్ల గణేష్ సెలబ్రిటీయా?' అని పృథ్వీరాజ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనకు ఎస్వీబీసీ చైర్మన్ పదవి రావడం పట్ల ఎంతమంది ఏడ్చారనేది.. ఏమి జరిగిందనేది ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసని అన్నారు. అంతేకాకుండా ఆంధ్రా తెలంగాణ ప్రజలు తనకు 'వివాదాల రాజు పృథ్వీరాజు' అనే టైటిల్ ఇచ్చారని చెప్పారు. ఇక లోకేష్ గురించి కూడా మాట్లాడుకోవాలా? అని వెటకారంగా మాట్లాడిన పృథ్వీరాజ్ తెలుగు స్పష్టంగా పలకడం రాని వ్యక్తి సీఎం ఏమవుతాడు అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల మరో 30 ఏళ్ళు సీఎం గా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ నేనంత నీచుడిని దౌర్భాగ్యుడిని ఎదవని కాదని కామెంట్స్ చేసారు.