గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా సల్మాన్ ఖాన్ తాజా చిత్రమైన 'భరత్' లో హీరోయిన్ గా నటించేందుకు మొదట అంగీకరించింది. కానీ షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి నటించడం లేదని ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఆ తర్వాత ఈ విషయంపై డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చాడు. వ్యక్తిగత కారణాల వల్ల పీసి సినిమానుండి తప్పుకుందని చెప్తూ ఇండైరెక్ట్ గా నిక్ జోనాస్ ప్రస్తావన తెచ్చి, పీసీ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు.
ఆ తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ నుండి ప్రియాంక తప్పుకోవడం పై కొత్త వార్తలు కూడా వస్తున్నాయి. ప్రియాంక తప్పుకోవడం సల్మాన్ కు నచ్చలేదని, దాంతో ప్రియాంకపై చాలా ఆగ్రహంగా ఉన్నాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ఈ విషయంపై ప్రియాంక అమ్మగారు మధు చోప్రా ను రిపోర్టర్లు ప్రశ్నిస్తే ఆమె ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. "ఈ ప్రశ్న సల్మాన్ ను అడిగితే బాగుంటుంది. ఎందుకంటే నాకు ఆ విషయం గురించి తెలీదు. ప్రియాంక 'భరత్' లో నటించడం లేదు. మీడియా లో ఏవేవో గాసిప్స్ వస్తుంటాయి. అవేవీ నిజాలు కాదు."
అవి నిజాలు కాదో అవునో గానీ నిక్ ఒక్కడే నిజం. ప్రస్తుతానికి ప్రియాంక ఆ నిక్కు ప్రేమలో ఉండడం నిజం.. దాని కారణంగానే 'భరత్' సినిమానుండి బయటకు రావడం నిజం. దాని వల్ల పీసీ అభిమానులు ఆమె హిందీ సినిఅమను మిస్ కావడం కూడా నిజం!