వెనక్కి వెళ్లే వీలు లేదు.. ముందుకెళ్లే దారి తెలీదు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దేశంలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 2.0 మూవీ ప్రస్తుత పరిస్థితి. శంకర్ డైరెక్షన్ లో రజనీ హీరోగా నటించిన రోబో సినిమా ట్రెమండస్ హిట్ సాధించి భారీ వసూళ్లు రాబట్టింది. ఈమధ్య కాలంలో సౌత్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. దీంతో లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో 2.0 సినిమా నిర్మించడానికి ముందుకొచ్చింది.
అసలు 2.0 స్టార్టింగ్ టైంలో అనుకున్న బడ్జెట్ రూ. 65 కోట్లు మాత్రమే. కానీ గ్రాఫిక్స్ అద్భుతంగా రావాలన్న ఉద్దేశంతో బడ్జెట్ ఇంకాస్త పెంచుకుంటూ పోయారు. అలా ఒకానొక దశలో రూ. 90 కోట్ల వరకు వెళుతుందని అనుకున్నారు. తీరా ఇప్పటివరకే రూ. 160 కోట్ల వరకు ఖర్చు చేసేశారు. దాదాపుగా షూటింగ్ పార్ట్ వరకు కంప్లీట్ చేసి గ్రాఫిక్ అండ్ 3డి కోసం అమెరికా స్టూడియోకు పంపించారు. కానీ అక్కడున్న టెక్నికల్ టీం ఇప్పటివరకు తీసింది 3డి వర్క్ కు పెద్దగా పనికిరాదని తేల్చిచెప్పేసిందట.
2.0 సినిమా షూటింగ్ మొత్తం అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కంప్లీట్ చేసినా వాటిని సరైన అవగాహన లేకుండా వినియోగించారని హాలీవుడ్ టెక్నీషియన్లు చెప్పారనేది కోలీవుడ్ టాక్. అలాగని ఇప్పుడు మళ్లీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి రీ షూట్ చేయలేరు. ఇంకా ఖర్చు పెట్టడానికి నిర్మాతలు కూడా ధైర్యం చేసే పరిస్థితీ లేదు. అలాగని క్వాలిటీ లేకుండా సినిమా కంప్లీట్ చేసి రిలీజయినా కలెక్షన్లు రావడం కష్టమే. ఇప్పుడు సినిమా ఆపలేరు.. పూర్తి చేయడమెలాగో తెలియడం లేదట 2.0 నిర్మాతలకు.