తెలుగు చిత్ర పరిశ్రమకి కొన్నాళ్ల పాటు పెద్ద దిక్కుగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించిన దివంగత దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇంటికే పెద్ద సమస్య వచ్చి పడింది. దాసరి మరణానంతరం ఆస్తి పంపకాల్లో వచ్చిన గొడవలు ఇంకా వివాదాంగానే మిగిలిపోయాయి. దాసరి నారాయణ ఇద్దరు తనయుల్లో ఒకరు ప్రభు మరొకరు అరుణ్ కుమార్ అనే విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఆస్తికి సంబంధించిన గొడవలు ముందు నుంచీ ఉన్నాయి. అయితే వాటిని పరిష్కరించేందుకు ఇప్పటికే ఎన్నోసార్లు సినీ పెద్దలు ప్రయత్నించినా అవి వ్యర్థమయ్యాయి. అయితే మరోసారి వీరి వ్యవహారం వివాదాస్పందగా మారింది. దాసరి ప్రభు తమ్ముడు అరుణ్ కుమార్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.
కాగా దాసరి పెద్ద కుమారుడు ప్రభు ఇంట్లోకి... చిన్న కుమారుడు అరుణ్ కుమార్ జూన్ 24న రాత్రి గేటు దూకి అక్రమంగా ప్రవేశించారని.. గేటుకు తాళం వేసి ఉన్నా దూకి ఇంట్లోకి వచ్చి తన భార్యను, మామయ్యను తనను దుర్భాషలాడాడని.. అరుణ్ ఆ సమయంలో బాగా తాగేసి ఉన్నాడని ప్రభు ఆరోపిస్తున్నారు. దాసరికి సంబంధించిన కొన్ని ఆస్తుల్ని ఇప్పటికే అరుణ్ అమ్మేశాడని.. ఇప్పుడు ఈ ఇంటిపై పడ్డాడని.. తనని చంపుతానని బెదిరించాడని ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా పోలీసుల ఎదుట కూడా అరుణ్ మరియు అతని భార్య సునీత కూడా తన కటుంబాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడారని.. గదిలోకి వెళ్లి బీరువా కూడా తెరిచేందుకు ప్రయత్నించాడని ప్రభు చెప్పుకొచ్చాడు.
ప్రభు మాట్లాడుతూ తన కుటుంబానికి చెందిన ఆస్తి వివాదంపై మోహన్ బాబు, సి. కల్యాణ్, మురళీ మోహన్ వంటి పెద్దలు స్పందించాలని కోరుతున్నారు. తాను ఉంటున్న ఇల్లు తన తండ్రి మనవరాలి పేరు మీద రాసి ఇచ్చారన్నారని.. తన కూతురు పేరు మీదున్న ఇంటిలోనే తాను ఉంటున్నామన్నారు. వీలునామా ప్రకారమే తాను ఆ ఇంటిలో ఉంటున్నామని.. కోర్టులో దీనిపై కేసు కూడా నడుస్తోందని దాసరి ప్రభు తెలిపారు. ఒకప్పుడు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించిన దాసరి ఇంటి సమస్యని ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దలుగా ఉన్నవారు కల్పించుకుని పరిష్కరిస్తారేమో చూడాలి.