మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కిన మూవీ పొన్నియన్ సెల్వన్. చోళుల కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి తమిళంలో హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న మూవీగా నిలిచింది. కార్తి, జయం రవి, చియాన్ విక్రమ్, త్రిష, ఐశ్వర్యరాయ్ లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు. అయితే పొన్నియన్ సెల్వన్ తమిళ ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయిన కూడా తెలుగులో ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.
తెలుగు నేటివిటీకి దూరంగా ఉండటం, అలాగే తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ ఎలిమెంట్స్ లేకపోవడం వలన పొన్నియన్ సెల్వన్ కి అనుకున్న స్థాయిలో తెలుగులో హిట్ కాలేదని చెప్పాలి. అలాగే బాహుబలి సిరీస్ ని చూసిన తర్వాత పొన్నియన్ సెల్వన్ లాంటి డ్రామాని చూడటానికి కూడా తెలుగు ప్రేక్షకులు అంత ఇష్టపడలేదు. ఇదిలా ఉంటే ఈ మూవీ తాజాగా తెలుగు టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యింది. జెమినీ టీవీలో ఈ సినిమా టెలికాస్ట్ అయ్యింది.
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయిన ఈ మూవీ ఓవరాల్ గా 2.73 రేటింగ్స్ ని మాత్రమే సొంతం చేసుకుంది. ఇక అర్బన్ ఏరియాలో అయితే మరీ తక్కువగా 2.17 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. ఓ విధంగా చెప్పాలంటే పొన్నియన్ సెల్వన్ లాంటి భారీ బడ్జెట్ మూవీకి ఇది ఘోరమైన డిజాస్టర్ రేటింగ్. తమిళంలో కమర్షియల్ సినిమాలకి కూడా ఇంతకంటే ఎక్కువ రేటింగ్స్ వస్తాయి. అయితే పొన్నియన్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఏ విధంగా ఆకట్టుకోలేదని ఈ రేటింగ్ బట్టి చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ 2 మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. పాన్ ఇండియా లెవల్ లోనే ఈ మూవీ కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్ కాస్తా గట్టిగా చేస్తే ఈ పార్ట్ 2 అయిన ఎంతో కొంత ప్రేక్షకులకి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు పోస్టర్ తో కూడా తెలుగులో ఈ మూవీ బజ్ క్రియేట్ చేయలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మొదటి సినిమా కంటే ఘోరమైన కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.