బాహుబలిని మించిపోతామంటూ ఎన్నెన్నో ప్రగల్భాలు, తమిళ చరిత్రకే తలమానికం అంటూ నోటికొచ్చినన్ని మాటలు, వేల కొద్దీ థియేటర్లు బ్లాక్ చేసి.. స్థాయికి మించిన విడుదల. ఇది విజయ్ పులి తీరు. ఇంతా చేస్తే.. అసలు పులి గర్జించిందా అంటే.. అది అతీ గతీ లేని పులి అయిపోయింది.
ఇన్ కం ట్యాక్స్ రెయిడ్స్ దెబ్బకి.. నిర్మాత ముందే పిల్లి అయిపోయాడు. దీంతో తన ఇంటి మీద కూడా దాడులు జరిగినా.. విజయ్ ముందుకొచ్చి బకాయిలు క్లియర్ చేయడంతో.. మొత్తానికి తమిళంలో రిలీజ్ అయింది. అది కూడా మొదటి షో 11గంటల తర్వాత పడింది. అప్పటివరకూ అన్నీ షోలను క్యాన్సిల్ చేసుకున్నారు. తెలుగులో అయితే.. ఏపీ, తెలంగాణల్లో ఎక్కడా ఈ మూవీ రిలీజ్ కాలేదు. కారణం మళ్లీ కామనే, తెలుగు డబ్బింగ్ రైట్స్ తీసుకున్న ప్రొడ్యూసర్ కి ఆర్థిక కష్టాలు.
తమిళ వెర్షన్ ని గట్టెక్కించడానికే నానా తంటాలు పడ్డ విజయ్, తెలుగును అసలు పట్టించుకోలేదు. పులి షోలను క్యాన్సిల్ చేస్తున్నట్లు ఉదయాన్నే తేల్చేశాయి థియేటర్స్. ఇంతా చేస్తే.. పులి ఎలా ఉందయ్యా అంటే.. ఫ్యాన్స్ కే చుక్కలు కనిపించాయంటున్నారు. కంటెంట్ అంతో ఇంతో బాగున్నా.. మేకింగ్ మాత్రం మరీ ఘోరంగా ఉండడంతో.. పులి పిల్లిలా అయిపోయింది. ఇలాకంటే మరో కొచ్చాడయాన్ అయిపోయింది అనడం కరెక్టేమో.