బిగ్ బాస్ గురించి ఆ విషయం నిజమేనన్న పున్ను

Update: 2020-07-01 15:00 GMT
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 గురించిన చర్చ మొదలయ్యింది. మహమ్మారి వైరస్ లేకుండా ఉంటే ఇప్పటి వరకు సీజన్ 4 గురించిన క్లారిటీ వచేసేది. ఈమధ్య షూటింగ్స్ కు ఒకే చెప్పడం తో అందుకు సంబంధించిన చర్చలు ప్రారంభం అయ్యాయి అనేది టాక్. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో సీజన్ 3 కంటెస్టెంట్ అయిన పునర్నవి సీజన్ 4 కంటెస్టెంట్స్ కు హెచ్చరిక లాంటిది చేసింది.

బిగ్ బాస్ హౌస్ లో చాలా జరుగుతాయి. వాటిలో కొన్ని మాత్రమే చూపిస్తారనే టాక్ ఉంది. అది నిజమే వాటిలో వారికి కావాల్సింది మాత్రమే చూపిస్తారు. 24 గంటలు జరిగిన విషయాలను కేవలం గంటలో చూపేందుకు వారు కొన్ని విషయాలను మాత్రమే తీసుకుంటారు. ప్రేక్షకులు ఏది చూస్తారో అదే చూపించాలని షో వాళ్ళు అనుకుంటారు. అందుకే షో లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలు ప్రేక్షకులు చూడరు.

చూపించిన దాంట్లో మీరు మంచిగా ప్రజెంట్ అవుతారా లేదా అనేది చెప్పలేము. అందుకే ప్రతి క్షణం జాగ్రత్తగానే ఉండాలి. ఇక సీజన్ 3 లో కొందరితో పునర్నవి గొడవ పడినది. ఇప్పుడు వారితో కూడా స్నేహంగా ఉంటున్నట్లుగా పేర్కొంది. అందరం పార్టీలు కూడా చేసుకుంటున్నట్లుగా చెప్పింది.
Tags:    

Similar News