కన్నడ చిత్ర సీమలో పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అప్పు.. పునీత్ రాజ్ కుమార్ ఇటీవల హార్ట్ స్ట్రోక్‌తో అకాలమరణం చెందిన విషయం తెలిసిందే. పునీత్ సేవల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాళ్లు ఇప్పటికీ ఆయన మరణించారంటే నమ్మలేకపోతున్నారు. అప్పు మన మధ్య లేరన్న విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ని తమ గుండె గుడుల్లో భద్ర పరుచుకున్నారు. పునీత్ మరణం తరువాత ఆయన 1800 మందికి చదువు చెప్పిస్తున్నాడని, ఎంతో మంది అనాధలకు, వృద్ధులకు ఆశ్రమాలు కట్టించడాని తెలిసి సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా కంటతడి పెడుతున్నారు.
ఇదిలా వుంటే తమ ఆరాధ్య నటుడు ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ఆయన జ్ఞాపకాల్ని భద్రపరుచుకుంటున్నారు. అప్పు మరణించినా ఇంకా తమ మధ్యే వున్నారని ఆయనపై వున్న ప్రేమని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా చాలా మంది ఫ్యాన్స్ పునీత్ రాజ్ కుమార్ 3డీ విగ్రహాలని తయారు చేయించుకుంటున్నారు. ఇందు కోసం తెనాలికి చెందిన శిల్పికి వెల్లువలా ఆర్డర్ లు వస్తున్నాయట.
పునీత్ మంచి తనాన్ని గుర్తు చేసుకుంటూ తమ ఏరియాల్లో ఆయన 3డీ విగ్రహాలని ప్రతిష్టించాలని అభిమానులు తెనాలికి చెందిన శిల్పి కాటూరి వెంకటేశ్వరరావుకు ఆర్డర్‌లు ఇస్తున్నారట. ఈ సందర్భంగా తన కుమారులు రవిచంద్ర, శ్రీహర్షలతో కలిసి కాటూరి వెంకటేశ్వరరావు 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో పునీత్ రాజ్‌కుమార్ మినీ యేచర్ విగ్రహాలను తయారు చేశారు. వీటిని ఇటీవల సూర్య శిల్ప శాలలో ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రస్తుతం సందడి చేస్తున్నాయి.