బాలీవుడ్ కి సౌత్ ట్యాలెంట్ పై ఎలాంటి గురి ఉందో ఇప్పటికే ప్రత్యక్షంగా కనిపిస్తోంది. మన సినిమాల డబ్బింగుల కోసం రీమేక్ ల కోసం ముంబై పరిశ్రమ వెంపర్లాడిపోతోంది. ఇక్కడ హిట్టయిన సినిమాల్ని హిందీలో రీమేక్ చేసి ఖాన్ లు.. కిలాడీలు హిట్లు కొడుతున్నారు. అలాగే మన దర్శకులందరినీ ఆహ్వానించి భారీగా ఆఫర్లు ఇస్తున్నారు. ప్రియదర్శన్- ప్రభుదేవా- సందీప్ రెడ్డి వంగ .. ఇలా ప్రతిభావంతులంతా బాలీవుడ్ కి వెళ్లి సక్సెస్ సాధించారు. ఇంకా ఎందరో అక్కడ సత్తా చాటిన దర్శకులు ఉన్నారు. లారెన్స్ మాస్టార్ కాంచన హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాల్లో ఉన్నాడు.
ఈ బాటలోనే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా బాలీవుడ్ కి వెళ్లబోతున్నారా? అంటే అవుననే సంకేతం అందింది. పూరి సినిమా చేస్తానంటే నేను రెడీ అంటూ కండల హీరో సల్మాన్ ఖాన్ సైతం స్వయంగా ఆఫర్ ఇచ్చారు. ఇది ఓపెన్ గా ఆయనే చెప్పడంతో ఇక పూరికి బాలీవుడ్ లో లైన్ క్లియర్ అయినట్టేనని అభిమానులు భావిస్తున్నారు. ఓ రకంగా ఇది పూరికి గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి.
పూరితో సల్మాన్ భాయ్ అనుబంధం గుర్తు చేసుకుంటే.. అసలు బాలీవుడ్ లో సల్మాన్ భాయ్ కి తొలి 100కోట్ల క్లబ్ సినిమాని ఇచ్చినది 'పోకిరి' హిందీ రీమేక్ 'వాంటెడ్'. ఆ చిత్రంతోనే ప్రభుదేవా దర్శకుడిగా అక్కడ పరిచయమయ్యాడు. పోకిరి తెలుగులో 40కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డ్ ను బ్రేక్ చేస్తే వాంటెడ్ కేవలం 33కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాలీవుడ్ లో 100కోట్ల క్లబ్ లో చేరడమే గాక అంతకుముందు ఉన్న రికార్డుల్ని బ్రేక్ చేసింది. అది పూరి రాసిన స్క్రిప్ట్. పూరి రాసిన స్క్రీన్ ప్లే మ్యాజిక్. అందుకే పూరి అంటే సల్మాన్ కి అంత గురి. ఇప్పుడు దబాంగ్ 3 రిలీజ్ ప్రమోషన్స్ లో హడావుడిగా ఉన్న సల్మాన్ .. ఉన్నట్టుండి పూరితో సినిమా చేస్తానని అనడం ఎంతో ఎగ్జయిట్ చేస్తోంది. ఇండియన్ సూపర్ స్టార్ నుంచి వచ్చిన ఈ ఆఫర్ ని పూరి ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత భాయ్ కోసం కథ రెడీ చేస్తాడేమో చూడాలి.