చిరంజీవి మొదటి సినిమా 'పునాది రాళ్లు' దర్శకుడు గూడపాటి రాజ్ కుమార్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని.. పట్టించుకునే కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడంతో ఆయన తీవ్ర అవస్థలు పడుతున్నట్లుగా ఆమద్య మీడియాలో కథనాలు వచ్చాయి. మొదటి సినిమాకే అయిదు నంది అవార్డులు అందుకున్న దర్శకుడు గూడపాటి రాజ్ కుమార్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లుగా మీడియాలో వచ్చిన వార్తలకు సినీ ప్రముఖులు పలువురు స్పందించారు.
తమకు తోచిన విధంగా సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. రాజ్ కుమార్ గారి పరిస్థితి తెలిసిన దర్శకుడు పూరి జగన్నాధ్ వెంటనే తన అసిస్టెంట్ తో 50 వేల రూపాయలను పంపించినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు పూరి సాయంకు రాజ్ కుమార్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు. పూరి మాత్రమే కాకుండా ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా రాజ్ కుమార్ కు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఎవరికి తోచిన సాయం వారు చేశారు.
పూరి రూ. 50 వేల సాయంతో పాటు మరో దర్శకుడు మెహర్ రమేష్ రూ. 10 వేలు.. నటుడు కాశీ విశ్వనాథ్ రూ.5 వేలు అందించారు. అంతకు ముందే ప్రసాద్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్టనర్ సురేష్‌రెడ్డి రూ.41 వేల సాయంను రాజ్ కుమార్ కు అందించారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా రాజ్ కుమార్ గారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆయనకు మంచి వైధ్యం అందించడంతో పాటు ఒక స్పెషల్ సిస్టర్ ను ఏర్పాటు చేసే విషయమై ఆయన సన్నిహితులు ఆలోచిస్తున్నారట.