రౌడీ ప్రభావం పూరీ పై పడిందా...?

Update: 2020-10-23 00:30 GMT
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో 'ఫైటర్' అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇది పూరీ - విజయ్ ఇద్దరికీ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ భారీ వర్కౌట్స్ చేయడంతో పాటు కఠినమైన శిక్షణ కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చాలా తక్కువ టైంలో సినిమా కంప్లీట్ చేసే పూరీ.. విజయ్ తో సినిమా కోసం మాత్రం ఎప్పుడూ లేని విధంగా సమయం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అందులోనూ పూరీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి రెగ్యులర్ గా ఏదొక అప్డేట్ తో జనాల్లో తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం పూరీ కొంత ట్రాక్ మార్చి ట్రై చేస్తున్న‌ట్లుగా అనిపిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్.. 'ఫైటర్' ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తుండటంతో ఎక్కువ టైం తీసుకుంటున్నాడేమో అనుకుంటున్నారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ గత చిత్రాలు 'డియర్ కామ్రేడ్' 'వరల్డ్ ఫేమస్' ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో రౌడీకి ఇప్పుడు ఒక హిట్ అవసరం ఉంది. దీంతో ఇప్పుడు ఈ బాధ్యత పూరీ పై ఉందని.. అందుకే పూరీ తన స్టైల్ మార్చి ఈ సినిమాకు ఎక్కువ టైం తీసుకొని తీస్తున్నాడని టాక్. కాగా, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యారర్ ఫై పూరీ - ఛార్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యహరిస్తున్నారు.
Tags:    

Similar News