ప్రముఖులు అడుగు తీసి అడుగు వేస్తే ఆసక్తి వ్యక్తమవుతుంది. అలాంటికి సమ్ థింగ్ స్పెషల్ దర్శకుడిగా పేరున్న పూరీ జగన్నాధ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లటం ఆసక్తికరంగా మారింది. పూరీ లాంటి దర్శకుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం ఏమిటో? అన్న ఆసక్తితో మీడియా ఆయన్ను ఫాలో అయ్యింది.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు దర్శకుడు పూరీ జగన్నాధ్ వెళ్లారన్న సమాచారంతో.. ఏం జరిగిందన్న ప్రశ్న తలెత్తింది. విషయం తెలుసుకునేందుకు మీడియా హడావుడిగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పూరీతో మాట కలిపి.. పోలీస్ స్టేషన్ అంటూ.. వివరాలు రాబట్టే ప్రయత్నం చేయగా.. మీడియా ప్రతినిదులు సందేహాలు అర్థమై.. వారికి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉదయ్ కుమార్ రెడ్డి తన ఫ్రెండ్ గా పూరీ చబుతూ.. ఆయన్ను కలిసేందుకు తాను పోలీస్ స్టేషన్ కు వచ్చానని వివరంగా చెప్పటంతో.. డౌట్స్ క్లియర్ అయిన మీడియా ప్రతినిధులు మంట పుట్టిస్తున్న వేడి వాతావరణం నుంచి కాళ్లు ఈడ్చుకుంటూ బయటపడ్డారు. సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్లకు వెళితే ఆ మాత్రం ఆసక్తి సహజం కదా?