డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న సినిమా 'లైగర్'. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఒక వైపు లైగర్ సినిమా షూటింగ్ దశలోనే ఉంది.. ఈ లోపే వీరిద్దరి కాంబోలో మరో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాను చేయబోతున్నాడట. ఈ సినిమాను మహేష్ బాబుతో చేయాలని రెండు మూడు సంవత్సరాలు గట్టిగా ప్రయత్నించాడు. కాని కొన్ని కారణాల వల్ల మహేష్ బాబుతో సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా వెయిట్ చేయడం వేస్ట్ అని భావించాడో లేక మరేంటో కాని మహేష్ బాబు తో కాకుండా విజయ్ దేవరకొండతో సినిమాను చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందించేందుకు గాను దర్శకుడు పూరి జగన్నాద్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రముక బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ భారీ పాన్ ఇండియా సినిమాను నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. లైగర్ సినిమా తో పాన్ ఇండియా హీరోగా మారబోతున్న విజయ్ దేవరకొండ కు జనగణమన సినిమా ఖచ్చితంగా మరో మెట్టు ఎక్కేలా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా కోసం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ భారీగా ప్లాన్ చేస్తున్నాడట. అందులో భాగంగానే ఏఆర్ రహమాన్ ను ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఏఆర్ రహమాన్ ఇండియాలోనే అత్యంత ఖరీదైన సంగీత దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు. జనగణమన సినిమాకు సంగీత దర్శకుడు అయితేనే న్యాయం చేస్తాడనే ఉద్దేశ్యంతో పూరి జగన్నాద్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా పూర్తి అయిన వెంటనే జనగణమన సినిమాను మొదలు పెట్టబోతున్నాడా లేదంటే సుకుమార్ తో సినిమా తర్వాత ఉంటుందా అనే విషయంలో గత కొన్నాళ్లుగా అనుమానాలు ఉన్నాయి. కాని తాజాగా ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది. సుకుమార్ తో విజయ్ దేవరకొండ సినిమా చేయడానికి ముందే పూరి జగన్నాద్ దర్శకత్వంలో జనగణమన సినిమా పట్టాలెక్కబోతుందట. విజయ్ దేవరకొండ చాలా ఇంట్రెస్ట్ తో ఆ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు చేయాల్సిన ఆ ప్రాజెక్ట్ ను విజయ్ దేవరకొండ దక్కించుకున్నాడు.
సినిమా ఫలితం కమర్షియల్ గా ఎలా ఉన్నా కూడా ఒక మంచి సినిమాగా ను చేశాం అనే సంతృప్తి మరియు గౌరవం దక్కుతుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను పూరి జగన్నాద్ అయినా విజయ్ దేవరకొండ అయినా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కనుక ఖచ్చితంగా కమర్షియల్ గా సినిమా ను సక్సెస్ చేసుకోవడం ఖాయం. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది. కనుక భారీ పాన్ ఇండియా మూవీగా నిలిచి మంచి వసూళ్లను దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు.