ఆయనగారు కథను కిచిడి చెయ్యకపోతే హిట్టు గ్యారెంటీ!

Update: 2020-03-31 15:00 GMT
యువ హీరో విజయ్ దేవరకొండకు అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ వచ్చింది. 'అర్జున్ రెడ్డి'.. 'గీత గోవిందం' సినిమాలతోఒక్కసారిగా యూత్ కు ఫెవరెట్ హీరోగా మారిపోయాడు. సినిమాల విజయం తో పాటుగా ప్రత్యేకమైన యాటిట్యూడ్ తో తనకంటూ సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అయితే ఈమధ్య వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. అటు 'డియర్ కామ్రేడ్'.. ఇటు 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాల ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం విజయ్ దృష్టి అంతా పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపైనే ఉంది.

ఈ సినిమాకు 'ఫైటర్.. 'లైగర్' అనే పేర్లను పరిశీలిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమా కథ పవర్ఫుల్ గా ఉందని.. విజయ్ కనుక తన గత సినిమాల తరహాలో డైరెక్షన్ విషయంలో జోక్యం చేసుకోకుండా దర్శకుడు చెప్పినట్టుగా వింటే మాత్రం మరో 'గీత గోవిందం' లాంటి భారీ హిట్టు దక్కడం ఖాయమని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. 'డియర్ కామ్రేడ్'.. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాల విషయంలో విజయ్ మితిమీరిన జోక్యం కారణంగానే కథ కాస్తా కిచిడిగా మారిందనే టాక్ ఉంది.

పూరి జగన్ ఓ సీనియర్ డైరెక్టర్. పైగా పవన్.. మహేష్ లాంటి టాప్ లీగ్ స్టార్స్ అందరిని హ్యాండిల్ చేసిన అనుభవం ఉంది కాబట్టి విజయ్ కి డైరెక్షన్ విషయంలో వేలు పెట్టే అవకాశం దక్కదని కొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే మరో విషయంపై కూడా చర్చ జరుగుతోంది. విజయ్ తన డైలాగులు ఆగి ఆగి చెప్తాడు.. విజయ్ తన డైలాగులను గడగడా చెప్పడం ఇంతవరకూ ఎవరూ చూసి ఉండరు. అయితే పూరి హీరోలు.. పేజీల కొద్దీ డైలాగులు.. గడగడా చెప్పేస్తూ పంచ్ లు వేస్తూ సందడిగా ఉంటారు. మరి పూరి ఈ రౌడీని తన స్టైలుకు ఎలా తీసుకొస్తాడా అనేది అందరికీ ఆసక్తి రేపుతోంది.
Tags:    

Similar News