అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. రష్మిక మందన్నా హీరోగా నటిస్తున్న ఈ సినిమా లో ఫాహద్ ఫాజిల్ మరియు సునీల్ లు విలన్స్ గా కనిపించబోతున్నారు. అనసూయ కీలక పాత్రలో నటించింది. ఇక సమంత మాస్ ఐటెం సాంగ్ లో కనిపించబోతుంది.
ఇవన్నీ కాకుండా అల్లు అర్జున్ మాస్ లుక్ తో పాటు రంగస్థలం రికార్డ్ వల్ల పుష్ప సినిమా మరో భారీ సూపర్ హిట్ గా నిలువబోతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లోకి సౌత్ లో 2021 బిగ్గెస్ట్ హిట్ గా పుష్ప సినిమా నిలవడం ఖాయం అనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు అక్కడ స్థానిక హీరోల స్థాయిలో స్టార్ డమ్ ఉంది. కనుక సహజంగానే కేరళలో బన్నీ సినిమాలు భారీ ఎత్తున విడుదల అవుతాయి. అయితే ఈసారి బన్నీ సినిమాలో మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ కూడా ఉండటంతో వారికి ఇది మల్టీ స్టారర్ అవ్వబోతుంది. అందుకే అక్కడ భారీ ఎత్తున ఈ సినిమా కోసం సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ పుష్ప సినిమా కు పోటీ గా అక్కడ మరే సినిమా విడుదల అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కేరళ లో పుష్ప సినిమాను విడుదల చేయబోతున్న బయర్లు ఏకంగా 40 ఫ్యాన్ షో లను రాష్ట్ర వ్యాప్తంగా వేసేందుకు ఇప్పటికే అనుమతలు తీసుకున్నారట.
ఈ సంఖ్య విడుదల సమయంకు 50కి పెరిగిన ఆశ్చర్యం లేదు. మోహన్ లాల్ మమ్ముట్టీ వంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈమద్య కాలంలో ఫ్యాన్స్ షో లు పడటం లేదు. అలాంటిది అల్లు అర్జున్ పుష్ప 1 కు అక్కడ ఫ్యాన్స్ షో లను వేయడం.. అది కూడా భారీ ఎత్తున వేసేందుకు సిద్దం అవ్వడం అభిమానులకు ఫుల్ హ్యాపీగా ఉంది.
ఇప్పటికే కొన్ని ఏరియాల్లో ఫ్యాన్స్ షో లకు సంబంధించిన టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయ్యిందట. ఇది ఖచ్చితంగా పుష్పకు అక్కడ భారీ వసూళ్లను తెచ్చి పెడుతుందని అంటున్నారు. ఒక మళయాలేతర మూవీ కేరళలో 40 ఫ్యాన్స్ షోలతో విడుదల అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఇది అరుదైన రికార్డ్ అనడంలో సందేహం లేదు. ఇక కన్నడంలో కూడా ఈ సినిమా భారీగా విడుదల కానుంది. కన్నడ స్టార్ రష్మిక మందన్నా ఈ సినిమాలో ఉండటమే అందుకు కారణం. ఇక ఉత్తరాదిన సినిమా మరో రేంజ్ అన్నట్లుగా విడుదల కాబోతుందట.