శ్రీవారి సమక్షంలో 'పుష్ప 2' ప్రకటన

Update: 2021-12-22 09:37 GMT
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా రెండు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు దక్కించుకుందట. లాంగ్ రన్ లో మరింతగా ఈ సినిమా వసూళ్లను నమోదు చేస్తుందనే టాక్ వినిపిస్తుంది.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా సినిమా మంచి పాజిటివ్‌ కలెక్షన్స్ ను రాబట్టిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా తిరుపతిలో భారీ సక్సెస్ వేడుక నిర్వహించారు. అల్లు అర్జున్ పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

పుష్ప సక్సెస్ వేడుక లో పాల్గొన్న చిత్ర యూనిట్‌ సభ్యులు నేడు తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారట. వీఐపీ ప్రారంభం దర్శన సమయంలో వీరు స్వామి వారిని దర్శించుకున్నారు.

ఆ తర్వాత వేద పండితులు చిత్ర యూనిట్‌ సభ్యులకు ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఆ తర్వాత బయటకు వచ్చిన చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా మంచి విజయాన్ని దక్కించుకున్నందుకు గాను స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చినట్లుగా ప్రకటించారు. అదే సమయంలో నిర్మాతల్లో ఒకరు పుష్ప 2 గురించిన అధికారిక ప్రకటన మరోసారి చేయడం జరిగింది.

పుష్ప రెండు పార్ట్‌ లుగా రాబోతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ ను విడుదల చేసిన రోజే రెండవ పార్ట్‌ ను గురించిన విషయాన్ని ప్రకటించారు. తిరుమల శ్రీవారి సన్నిదానంలో మరోసారి పుష్ప 2 గురించిన ప్రకటన చేయడం జరిగింది. పుష్ప 2 ను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండే ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు.

పుష్ప రెండు పార్ట్‌ లకు మద్యలో బన్నీ ఒక సినిమాను చేస్తాడనే వార్తలు వచ్చాయి. కాని పుష్ప 2 ఫిబ్రవరి నుండే మొదలు కనుక బన్నీ మరే సినిమాను మొదలు పెట్టే అవకాశాలు లేవని తెలుస్తోంది. పుష్ప 2 కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్‌ రెడీగా ఉండి ఉంటుంది. కనుక ఎక్కువ సమయం లేకుండా వచ్చే ఏడాది మళ్లీ ఇదే టైమ్ కు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.


Tags:    

Similar News