ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సెన్సేషనల్ మూవీ 'పుష్ప ది రైజ్' గత ఏడాది డిసెంబర్ లో విడుదలై సంచలనాలు సృష్టించింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీమేకర్స్, ముత్యంశెట్టి మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదలైన ఈ మూవీ ఊహలకందని స్థాయిలో వసూళ్ల పరంగా సంచలనాలు సృష్టించింది.
అంతే కాకుండా సైలెంట్ గా ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా బాలీవుడ్ లో విడుదలైన ఈ మూవీ అక్కడ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించి ట్రేడ్ వర్గాలని సర్ ప్రైజ్ చేసింది. డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లని రాబట్టడం ఇదే తొలిసారి అంటూ బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ప్రీ ప్లానింగ్ లేకుండానే హడావిడిగా సినిమాని రిలీజ్ చేయడంతో బాలీవుడ్ లో సినిమా ప్రమోషన్స్ కి మేకర్స్ కి పెద్దగా టైమ్ లేకుండా పోయింది.
అంతే కాకుండా బాలీవుడ్ లో ఈ మూవీని రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా ప్రమోషన్స్ పై పెద్దగా ఆసక్తిని చూపించలేదు. దీంతో టీమ్ కూడా ప్రచారానికి వెళ్లలేదు. అయినా ఈ మూవీ బాలీవుడ్ లో భారీ వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్ట్రెయిట్ వెర్షన్ ని మించి బాలీవుడ్ లో డబ్బింగ్ వెర్షన్ వసూళ్లని రాబట్టడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. దీంతో పార్ట్ 2పై సర్వత్రా ఆసక్తి, బిజినెస్ పరంగా భారీ బజ్ క్రియేట్ అయింది.
దీనికి తోడు ఇటీవల విడుదలైన 'కేజీఎఫ్ 2' సంచలనాలు సృష్టించడంతో 'పుష్ప 2' పై బాలీవుడ్ లోనూ భారీగా క్రేజ్ పెరిగిపోతోంది. సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే భారీ స్థాయిలో హిందీ డబ్బింగ్ రైట్స్ కు గట్టిపోటీ నెలకొందట. దీంతో మేకర్స్ ఈ మూవీ హిందీ రైట్స్ విషయంలో బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ కి షాకిచ్చినట్టుగా తెలుస్తోంది. పార్ట్ 1 హ్యూజ్ హిట్, అంతే కాకుండా ఇటీవల విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న 'కేజీఎఫ్ 2'ని దృష్టిలో పెట్టుకుని 'పుష్ప 2' కోసం భారీగా ఖర్చు చేయబోతున్నారట.
దాదాపుగా 375 కోట్ల మేర పార్ట్ 2 కు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేసిన సుకుమార్ ఈ మూవీని పార్ట్ 1 కి మించి హై స్టాండర్డ్స్ లో సరికొత్త ట్విస్ట్ లు, టర్న్ లతో తెరపైకి తీసుకురాబోతున్నారట. ఇందు కోసం ఇప్పటికే పక్కాగా ప్లాన్ ని రెడీ చేసిన సుకుమార్ పార్ట్ 2 ని జూలై నుంచి మారేడుమిల్లిలోనే ప్రారంభించబోతున్నారట.
వచ్చే ఏడాది జనవరి వరకు షూటింగ్ ని పూర్తి చేసి సినిమాని చాలా ప్లాన్డ్ గా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఎలాంటి హరీ బరీకి వెళ్లకుండా చాలా కూల్ గా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది. ఆ కారణంగానే మేకర్స్ బాలీవుడ్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడినా అప్పుడే ఇవ్వకూడదని, హోల్డ్ లో పెట్టారని ఇన్ సైడ్ టాక్.