'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' సాంగ్: ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టిన పుష్పరాజ్..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ''పుష్ప''. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. వరుస అప్డేట్స్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా సినిమాలోని 'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' అనే నాలుగో పాట లిరికల్ వీడియోని విడుదల చేశారు.
''ఆ పక్కా నాదే.. ఈ పక్కా నాదే.. తలపైన ఆకాశం ముక్కా నాదే.. ఆ తప్పూ నేనే.. ఈ ఒప్పూ నేనే.. తప్పొప్పులు తగలెట్టే నిప్పూ నేనే..'' అంటూ సాగిన ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తోంది. లారీ డ్రైవర్ పుష్పరాజ్ గంధపు చెక్కల అక్రమ రవాణాలో కింగ్ గా ఎదిగిన విధానాన్ని ఈ పాట వివారిస్తోంది. ఇందులో మాస్ గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ వేసిన సింపుల్ స్టెప్స్ కూడా ఊర మాస్ గా ఉన్నాయి. థియేటర్లో ఈ పాటకు విజిల్స్ గ్యారెంటీ అని లిరికల్ వీడియో హామీ ఇస్తోంది.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ మాసీ సాంగ్ కు ట్యూన్ కంపోజ్ చేశారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ పాట రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్ కు గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించగా.. సింగర్ నకాశ్ అజీజ్ హుషారుగా ఆలపించారు.
'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' పాటకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కాన్సెప్ట్ డిజైన్ చేయగా.. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందించగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఆస్కార్ విన్నర్ రసూల్ పోకుట్టి ఈ సినిమాకు సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు.
'పుష్ప' చిత్రాన్ని ముత్యంశెట్టి మీడియా సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ - సునీల్ - అనసూయ భరద్వాజ్ - ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో 'పుష్ప: ది రైజ్' విడుదల కానుంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు - పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన 'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' యూట్యూబ్ ని షేక్ చేస్తోంది.
Full View