ఎవరైనా సింపుల్ గా ఉండే స్టార్ పేరు చెప్పమంటే సహజంగా అందరూ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెప్తారు. కానీ అది సరైన అభిప్రాయం కాదని కొద్దిరోజుల క్రితం రజనీనే స్వయంగా అన్నారు. చెన్నైలో అత్యంత ఖరీదైన ఏరియా పోయెస్ గార్డెన్లో ఇల్లు.. ఇంటినిండా లగ్జరీ కార్లు.. ఫైవ్ స్టార్.. సెవెన్ స్టార్ హోటల్స్ లో బస చేయడం.. భోజనం చేయడం.. ఇది నా లైఫ్ స్టైల్.. నేను సింపుల్ ఏంటని అన్నారు. అయన సింపుల్ కాకపొతే మరి సింపుల్ గా ఉండే స్టార్ ఎవరు?
పైన ఫోటో చూస్తే మనకు సమాధానం వెంటనే దొరుకుతుంది. ఆయనే పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి. అభిమానులు.. శ్రేయోభిలాషులు ఆయనను మూర్తన్నా అని ప్రేమగా పిలుచుకుంటారు. అయనకంటే సింపుల్ గా ఉండే సెలబ్రిటీని మనం భూతద్దం పెట్టి వెతికినా తీసుకురాలేం. విప్లవభావాలు.. సమసమాజస్థాపన.. (సామాజిక న్యాయం అనాలని ఉంది గానీ ఆ పదానికి విపరీత అర్థం వచ్చేసింది కాబట్టి వాడాలంటే భయం వేస్తోంది) ఇలాంటి కథాంశాలతో సినిమాలు తీస్తూ ప్రేక్షకుల ఆదరణ చూరగొన్నారు ఆయన. రీసెంట్ గా మూర్తన్న ఫోటో ఒకటి సామజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అయింది.
ఈ ఫోటోలో ఆయన వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఒక సాధారణ వ్యక్తిలాగా కవర్ లో తెచ్చుకున్న భోజనాన్ని రైల్వే స్టేషన్లో ఒక పిల్లర్ ను ఆనుకుని ఉన్న అరుగుపై కూర్చుని తినటానికి రెడీ అవుతున్నాడు. నేను సెలబ్రిటీని అనే భావన ఆయనలో ఏమాత్రం లేదు. అసలు చుట్టుపక్కల ఎవరున్నారో ఏమాత్రం పట్టించుకోకుండా అయన ఇలా సింపుల్ గా ఉండడం నెటిజనులను క్లీన్ బౌల్డ్ చేసింది. మూర్తన్నపై .. అయన సింపుల్ నేచర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాల్లో నీతులు చెప్పి నిజజీవితంలో అందుకు విరుద్దంగా ప్రవర్తించే ఘనులు ఉన్న ఈ కాలంలో ఇలాంటివారు కూడా ఉన్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Full View