త‌న‌ పై డ్ర‌గ్స్ ఆరో‌ణ‌ల‌ పై `రేసు గుర్రం` విల‌న్ వివ‌ర‌ణ‌

Update: 2020-09-20 09:50 GMT
బాలీవుడ్ లో ‘మాదకద్రవ్యాల దుర్వినియోగం’ ఆరోపణలతో అట్టుడుకుతున్న సంగ‌తి తెలిసిందే. సుశాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం కేసులో రియా చక్ర‌వ‌ర్తి ప‌లువురి పేర్ల‌ను బ‌య‌ట‌పెట్టింద‌న్న ప్ర‌చారం వేడెక్కించింది. ఇక ఇదే అద‌నుగా బాలీవుడ్ లో వైరి వ‌ర్గాలంతా ఒక‌రిపై ఒక‌రు విరుచుకుప‌డుతూ త‌మ‌కు సంబంధించిన చాలా తెలియ‌ని వాటిని సోష‌ల్ మీడియాల్లో బ‌య‌ట పెట్టేస్తున్నారు.

తాజాగా రేసుగుర్రం ఫేం న‌టుడు రవి కిషన్ ‘కలుపు’ (మాద‌క ద్ర‌వ్యాలు) సేవించేవార‌ని ద‌ర్శ‌క‌నిర్మాత అనురాగ్ కశ్యప్ ఆరోపించారు. కశ్యప్ మాట్లాడుతూ.. కిషన్ వారంలో పొగ (మ‌త్తు) త్రాగేవాడు. కాని అతను దాని గురించి బ‌య‌ట‌ప‌డ‌డు!! అంటూ వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపింది.

కశ్యప్ తనపై చేసిన ఆరోపణలపై తాజాగా ర‌వి కిషన్ స్పందించారు. “నేను అనురాగ్ కశ్యప్ నుండి ఇలాంటి మాటలు ఊహించలేదు. నేను శివుని భక్తుడిని అన్నది రహస్యం కాదు కాబట్టి నేను అతని పేరు జపించాను. మాదకద్రవ్యాలపై యుద్ధం స‌మ‌యంలో ఈ సమస్యపై అతను నాకు మద్దతు ఇవ్వలేదని నేను బాధపడ్డాను. నేను ధూమపానం చేసినా కానీ.. మంత్రి అయినందున నేను ఇప్పుడు శుభ్రంగా ఉన్నాను ” అని ర‌వి కిషన్ అన్నారు.

దేశంలో మాదక ద్రవ్యాల రవాణా సమస్యతో సంబంధం ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవి కిషన్ సోమవారం కేంద్రాన్ని కోరారు. అందుకు సంబంధించిన ఆయ‌న వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News