బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''రాధే''. 'యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' అనేది దీనికి ఉపశీర్షిక. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో సల్మాన్ సరసన దిశా పటానీ హీరోయిన్ గా నటించింది. రణదీప్ హుడా - జాకీ ష్రాఫ్ - 'ప్రేమిస్తే' భరత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. కోవిడ్ నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఈద్ సందర్భంగా మే 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి థియేట్రికల్ రిలీజ్ తో పాటుగా డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం. ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో జీ ప్లెక్స్ - డిష్ టీవీ - డీటుహెచ్ - టాటా స్కై - ఎయిర్ టెల్ డిజిటల్ టీవీల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. తాజాగా 'రాధే' మూవీ డిజిటల్ రిలీజ్ కి టికెట్ ధరను నిర్ణయించారు.
ఓటీటీలో 'రాధే' సినిమా చూడటానికి 249 ₹ చెల్లించాలని చెబుతూ మేకర్స్ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఓటీటీలో సినిమా అంటే ఫ్యామిలీ అంతా కలిసి చూస్తారనే భావనతో రూ. 249 గా టికెట్ రేట్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇది చాలా పెద్ద మొత్తం అని చెప్పవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాలో టికెట్ రేట్ తగ్గించమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి ప్రేక్షకులు పూర్తి థియేట్రికల్ అనుభూతి కోసం టికెట్లు కొనడానికి వస్తారు. ఏసీ థియేటర్ లో బిగ్ స్క్రీన్ మీద డాల్బీ సౌండింగ్ తో చూస్తే ఆ ఎక్సపీరియన్స్ వేరేగా ఉంటుందిన్కాబట్టి ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి వెనుకాడరు. కానీ పే ఫర్ వ్యూలో ఎంత ధర పెట్టినా అది మాత్రం దొరకదనే చెప్పాలి. ఇప్పుడు 'రాధే' సినిమాకు అంత ధర పెట్టడంతో అందరూ పైరసీలో సినిమా చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సినిమా వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకున్నా ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ వచ్చే ప్రతి సినిమా కూడా కొన్ని నిమిషాల్లోనే హెచ్ డీ క్వాలిటీతో పైరసీ చేస్తున్నారు. ఇంతకముందు పే ఫర్ వ్యూలో ఎక్కువ రేట్ పెట్టిన చాలా సినిమాలు పైరసీ భూతానికి బలయ్యాయి. మరి ఇప్పుడు 'రాధే' పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
కాగా, ''రాధే'' సినిమా సౌత్ కొరియన్ మూవీ 'వెటరన్' కు రీమేక్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి సాజిద్ వాజిద్ - దేవిశ్రీ ప్రసాద్ - హిమేశ్ రేష్మియా సంగీతం సమకూర్చారు. 'డీజే- దువ్వాడ జగన్నాథం' లోని 'సీటీమార్' పాటను ఈ సినిమా కోసం దేవిశ్రీ రీమేక్ చేశారు. సంచిత్ - అంకిత్ ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించగా.. అవనంక బోస్ సినిమాటోగ్రఫీ వర్క్ చేశారు. జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై సల్మాన్ ఖాన్ - సోహైల్ ఖాన్ - రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి సంయుక్తంగా నిర్మించారు.