సినిమా రంగంలోనూ కాంట్రవర్సీలకి చాలా పాపులారిటీ. ఒక్కోసారి పదుల సంఖ్యలో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క కాంట్రవర్సీతో వచ్చేస్తుంటుంది. అందుకే తమ గురించి అంతా మరిచిపోతున్నారేమో అనుకొన్నప్పుడు కొద్దిమంది ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తూ మీడియాని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి విషయాల్లో కథానాయికల హడావుడే ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాంతో వార్తల నిండా వాళ్లే కనిపిస్తూ బోలెడంత పాపులారిటీ సంపాదించేస్తుంటారు. కొద్దిమందిని మాత్రం అనుకోకుండా వివాదాలు చుట్టుముడుతుంటాయి. ఇక్కడ ఎవరు కారణం అనేది చెప్పలేం కానీ... మరాఠీ భామ రాధికా ఆప్టే మాత్రం కొంతకాలంగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తూ వస్తోంది. ఒక కాంట్రవర్సీ పూర్తయ్యేసరికి మరో కాంట్రవర్సీతో ఆమె వార్లల్లోకి ఎక్కుతుంటుంది. దీంతో రాధికా గురించి పూర్తిగా తెలియనివాళ్లంతా ఆమె వ్యక్తిగత వివరాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఉత్సుకతే రాధికా ఆప్టేని గూగుల్ క్వీన్ గా మార్చేసింది.
అవును మరి... ఇటీవల తీసిన లెక్కల ప్రకారం గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తిగా రాధికా ఆప్టేకి రెండో స్థానం దక్కింది. తొలి స్థానంలో దివంగత అబ్దుల్ కలామ్ నిలవగా రెండో స్థానం కథానాయిక రాధికా ఆప్టే సొంతం చేసుకోవడం విశేషం. మొన్నటిదాకా రాధికా ఆప్టే అంటే ఎవరో ఆమె సినిమాలు చేసిన రెండు మూడు భాషల్లోనే తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచం మొత్తం ఆమె గురించే మాట్లాడుకొంటోంది. ఆమె విషయంలో క్రియేట్ అయిన వివాదాల ప్రభావమే అది.
ఓ షార్ట్ ఫిల్మ్ కోసమని రాధికా ఆప్టే నగ్నంగా నటించడం, అందుకు సంబంధించిన వీడియో క్లిప్ బయటికి పొక్కడం సంచలనం రేకెత్తించింది. వాట్సాప్ ల్లోనూ, ఫేస్ బుక్ లోనూ ఎక్కడ చూసినా రాధికా వీడియోనే కనిపించింది. అది పూర్తయ్యిందో లేదో బాత్ రూమ్ లో నగ్నంగా సెల్ఫీలు తీసుకొన్నప్పటి ఫొటోలు బయటికొచ్చాయి. దాంతోపాటు ఇటీవల అహల్య అనే షార్ట్ ఫిల్మ్ చేసింది. అందులో ఓ వృద్ధుడికి భార్యగా యమా స్పైసీగా తెరపై కనిపించింది. ఇన్ని వివాదాలొచ్చాక మీడియా ఆమెని వదులుకొంటుందా స్పెషల్ స్టోరీలు చేసుకొని మరీ ఆమెని టీవీల్లో చూపించేశారు. ఇవి చాలవన్నట్టు `లయన్`లో బాలకృష్ణ సరసన నటించిన రాధికా ఆప్టే ఆ సినిమా చిత్రీకరణ పూర్తవ్వగానే ముంబై వెళ్లి తెలుగు పరిశ్రమపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. తెలుగులో హీరోలకి ఇచ్చినంత ప్రాధాన్యం హీరోయిన్లకి ఇవ్వడం లేదని వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలు కూడా సంచలనం రేకెత్తించాయి. ఇవన్నీ రాధిక ఆప్టేని రాత్రికి రాత్రే పాపులర్ చేసేశాయి. దీంతో అందరూ రాధికా ఆప్టే గురించి సెర్చ్ చేయడం మొదలెట్టారన్నమాట.