బన్నీ సినిమాకు రెహమాన్ మ్యూజిక్?

Update: 2017-10-16 04:02 GMT
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటేనే పాటలు - డ్యాన్సులు ఓ లెక్కలో ఉంటాయని అభిమానులు ఆశిస్తారు. దానికి తగ్గట్టే బన్నీ కూడా పాటలపై ప్రత్యేకమైన ఫోకస్ పెడతాడు. అందుకే అతడి సినిమాల్లో మ్యూజికల్ హిట్లెక్కువ. ఒకవేళ సినిమా ఫ్లాపయినా పాటలు మాత్రం జనాలను బాగానే ఆకట్టుకుంటాయి.

అల్లు అర్జున్ కెరీర్ గ్రాఫ్ ఊపందుకున్నప్పటి నుంచి తన సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎ.ఆర్.రెహమాన్ ను ఎంచుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఓరకంగా అది బన్నీకి కలగా ఉండిపోయింది. ఇప్పుడు కల నెరవేరేలాగానే కనిపిస్తోంది. రన్ - పందెంకోడి చిత్రాల దర్శకుడు ఎన్.లింగుస్వామి డైరెక్షన్ లో అల్లు అర్జున్ తెలుగు - తమిళంలో ఓ ద్విభాషా చిత్రం చేయనున్నాడు. ఈ మూవీకి ఎ.ఆర్.రెహమాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్టేనని తెలుస్తోంది.

ప్రస్తుతం బన్నీ రైటర్ వక్కంతం వంశీ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో బన్నీ మిలటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చురుగ్గా సాగుతోంది. ఇది పూర్తయ్యాక వచ్చే ఏడాది నుంచి లింగుస్వామి డైరెక్షన్ లో వచ్చే సినిమా వర్క్ ప్రారంభించే అవకాశం ఉంది.


Tags:    

Similar News