బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో హార్ట్ బ్రేక్ అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది. ఆ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన టైంకు కాస్త అటు ఇటుగా పునర్నవి తన ఎంగేజ్ మెంట్ అనే అర్థం వచ్చేలా ఒక ఫొటోను షేర్ చేసింది. పున్ను ఎంగేజ్ మెంట్ వల్లే రాహుల్ హార్ట్ బ్రేక్ అంటూ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. రాహుల్ హార్ట్ ను పున్ను బ్రేక్ చేసింది అంటూ ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. తీరా చూస్తే పున్ను పోస్ట్ చేసిన ఫొటో తన వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం అంటూ ఆ తర్వాత వెళ్లడి అయ్యింది.
పున్ను ఫొటోకు క్లారిటీ వచ్చింది కాని రాహుల్ హార్ట్ బ్రేకింగ్ కు సంబంధించిన క్లారిటీ మాత్రం రాలేదు. ఎట్టకేలకు రాహుల్ ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు. తనుకు పున్ను వల్ల హార్ట్ బ్రేక్ అవ్వలేదు అంటూ స్పష్టత ఇచ్చాడు. తాను కేవలం ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్లే హార్ట్ బ్రేక్ అంటూ పెట్టాను అన్నాడు. ఒక పాట కోసం 58 లక్షలు ఖర్చు చేశాం. ఆ పాట ఏమాత్రం సక్సెస్ కాలేదు. ఆ పాట కోసం నేను 28 లక్షలు ఖర్చు చేశాను. ఆ డబ్బు పోవడం వల్లే నేను చాలా నిరుత్సహంతో హార్ట్ బ్రేక్ పెట్టాను. అంతకు మించి ఏమీ లేదన్నాడు. రాహుల్ సంపాదించింది ఎక్కువ ఆ పాటకు ఖర్చు చేశాడట. దాంతో అతడు చాలా ఫీల్ అయ్యి ఆ పోస్ట్ పెట్టాడు.