రజనీకాంత్ కబాలి సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 65 దేశాల్లో విడుదలయిన విషయం తెలిసిందే! సూపర్ స్టార్ రజనీ సినిమా నటుడు కాకముందు బస్ కండక్టర్ గా పనిచేసేవారనే విషయమూ తెలిసిందే. అయితే తాజాగా సినిమా రివ్యూలపై ఇండస్ట్రీ జనాలు విమర్శలు లేవనెత్తుతున్న తరుణంలో ఇతర వ్యక్తులు - జర్నలిస్టులు - క్రిటిక్కుల రివ్యూలను కోరని రజనీ.. ఒక్కరి రివ్యూ మాత్రం కోరారట. ఆ ఒక్కరూ మరెవరో కాదు... రజనీ స్నేహితుడు - ఒకప్పటి రజనీ సహచరుడు అయిన రిటైర్డ్ బస్ డ్రైవర్ పి. రాజ బహదూర్. రజనీ - రాజ బహదూర్ లు 1970 నుంచి మంచి స్నేహితులుగా ఉండేవారట - ఇద్దరూ ఒకే రూటులో ప్రయాణించే బస్సులో పనిచేసేవారట. అప్పట్లో రజనీ రంగస్థల నాటకాలు వేసేవారట. ఈ విషయాలన్నీ రాజ బహదూర్ తాజాగా షేర్ చేసుకున్నారు.
అయితే తాజాగా విడుదలయిన కబాలి సినిమాకు సంబందించిన విషయాలపై మాట్లాడిన రాజ బహదూర్... తన సినిమాల పై రివ్యూలను రజనీ తన నుంచి కోరుతుంటాడని తెలిపారు. ఇప్పటికీ రజనీ - రాజ బహదూర్ లు ఇద్దరూ ఏకవచనంతోనే ఒకరినొకరు పిలుచుకుంటారని, రజనీ ఎప్పుడు బెంగళూరు వెళ్లినా ఇద్దరూ కలుసుకుంటారని, అప్పట్లో తిరిగిన ప్రదేశాలు తిరుగుతూ, గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంటారని చెప్పుకొచ్చారు! అయితే తాజాగా విడుదలయైన కబాలి సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఒక థియేటర్ ఓనర్ తనను ఆహ్వానించి నీ స్నేహితుడి సినిమా చూడమని కోరాడని తెలిపాడు. మరో విషయం ఏమిటంటే... అప్పట్లో రజనీ రంగస్థల నాటకాలు వేస్తున్న సమయంలో చెన్నై వెళ్లి అగ్ర దర్శకుల వద్ద పని చేయాలని రాజబహదూర్ సూచించారట కూడా!