సూపర్ స్టార్ తో జక్కన్న సినిమా ఖాయమా?

Update: 2017-05-01 10:35 GMT
టాలీవుడ్ మూవీ బాహుబలి2 సాధిస్తున్న వసూళ్లు అనన్య సామాన్యం. తొలి వారాంతం ముగిసేనాటికే తెలుగు-తమిళ్-హిందీ-మలయాళ వెరన్లకు 500 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల మార్క్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇప్పుడు రాజమౌళి చిన్న బ్రేక్ తీసుకోని ఫారిన్ టూర్ వెళుతున్నాడు. తిరిగొచ్చాక కొత్త సినిమా గురించి ఆలోచన చేస్తానని ముందే చెప్పాడు. అయితే.. జక్కన్న మరుసటి చిత్రంపై ఇప్పుడో క్లారిటీ వచ్చినట్లుగా కనిపిస్తోంది. రాజమౌళి స్వయంగా పెట్టిన ట్వీట్.. దీనిపై ఓ క్లారిటీకి కారణమవుతోంది. బాహుబలి2 సాధించిన ఘనవిజయాన్ని అన్ని భాషల పరిశ్రమల్లోని ప్రముఖులంతా ప్రశంసిస్తున్నారు. వేటికీ పెద్దగా స్పందించని రాజమౌళి.. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ పొగడ్తలకు మాత్రం బాగా ఎగ్జయిట్ అయిపోయాడు.

తిరిగి ఇచ్చిన రిప్లై కూడా ఓ రేంజ్ లో ఉంది. 'సాక్షాత్తూ దేవుడే దిగి వచ్చి ఆశీర్వదించినట్లు అనిపిస్తోంద'ని జక్కన్న ఉవాచ. గతంలో ఓ సారి రాజమౌళి- రజినీకాంత్ లు కలిసి పని చేయడంపై చర్చలు జరిగాయి. ఇప్పుడు సూపర్ స్టార్ ప్రశంసలు.. రాజమౌళి రియాక్షన్ చూస్తుంటే.. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లే కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News