దర్శక ధీరుడు రాజమౌళికి దేశవ్యాప్తంగా మాములు క్రేజ్ లేదు. పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోలకు ఉండే క్రేజ్ ని ఆయన సినిమాలతో దక్కించుకున్నారు. బాహుబలి సినిమాతో రాజమౌళి దేశం మొత్తానికి పరిచయమయ్యాడు. ప్రస్తుతం ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా "రౌద్రం రుధిరం రణం" ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల జీవితగాథల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా మోషన్ పోస్టర్ ను చిత్రబృందం ఇటీవలే విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఆ మోషన్ పోస్టర్ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలను పెట్టి రూపొందిస్తున్నారు కాబట్టి రీసెంట్ గా ఫ్యాన్స్ లో గందరగోళం ఏర్పడిందట. రాజమౌళి సినిమా తీస్తున్నాడు అంటే ఏ హీరో ఫ్యాన్స్ కైనా అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అలాంటిది ఇద్దరు హీరోలను పెట్టేసరికి ఆర్ఆర్ఆర్ సినిమాలో ఏ హీరోకి ఎక్కువ ఇంపార్టెంట్ అవుతాడో అని సందేహాలు మొదలయ్యాయి. మా హీరో అంటే మా హీరో ఫేమస్ అవుతాడు? మా హీరోకే ఎక్కువ పేరు వస్తుందని.. ఇరు హీరోల అభిమానులలో ఫైట్ మొదలయిందట. అయితే రాజమౌళి సినిమాలో హీరోలకు ఎంత పేరు వస్తుందో తెలియదు కానీ రాజమౌళికి మాత్రం విపరీతంగా క్రేజ్ వచ్చేస్తుంది. అంటే ఆర్ఆర్ఆర్ లో మెయిన్ హీరో రాంచరణ్ కాదు, ఎన్టీఆర్ కాదు.. మరెవరు అంటే మాత్రం ఆయన సినిమాకి ఆయనే హీరో అని నిరూపించుకుంటున్నాడు రాజమౌళి. కాబట్టి ఆయన సినిమాలలో అందరికి సమాన ప్రాధాన్యం ఉంటుంది. ఫ్యాన్స్ అంతా కంగారు పడాల్సిన అవసరం లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. రాజమౌళి సినిమాకి రాజమౌళినే హీరో అంటూ నెట్టింట్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి.