''మగధీర'' వంటి హిట్టు సినిమాను తీశాక రాజమౌళి ఏం చేశాడు? అసలు తరువాతి సినిమాతో ఏ మాత్రం హైప్ క్రియేట్ చేయకూడదని ఫిక్సయ్యాడు. అందుకే వెంటనే ''మర్యాద రామన్న'' అంటూ ఒక కామెడీ సినిమాను తీశాడు. పైగా మగధీర సినిమాలో రామ్ చరణ్ ప్రక్కనే ఫ్రెండుగా కామెడీ వేషం వేసిన సునీల్ ను తీసుకుని.. మర్యాద రామన్నతో హీరోను చేసేశాడు.
కట్ చేస్తే ఇప్పుడు ''బాహుబలి 2'' రిలీజయ్యాక కూడా అసలు విజువల్ ఎఫెక్ట్స్ తో సంబంధం లేని ఒక సినిమా చేయాలని ఉందని రాజమౌళి చెప్పాడు. అందుకే ఇప్పుడు ఆ కామెడీ సినిమాను ఈ బాహుబలి 2వ భాగంలో కామెడీ చేసిన యాక్టర్ తోనే చేస్తాడేమో అంటూ జనాలు తెగ డిస్కషన్లు జరుపుతున్నారు. బాహుబలి 2 సినిమాలో సుబ్బరాజు పోషించిన కుమారవర్మ క్యారక్టర్ బాగానే కామెడీ పండించింది. అందుకే ఆ కామెడీ చేసిన అతడినే ఇప్పుడు సునీల్ ను యాక్షన్ కామెడీ హీరోగా చేసినట్లుగా రాజమౌళి హీరోను చేసే ఛాన్సుందని జనాలు కామెడీ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇదో మాంచి కిక్కిచ్చే జోక్ లా ఉందంతే.
ఇకపోతే రాజమౌళి బాహుబలి 2 రిలీజ్ తరువాత నేషన్ వైడ్ పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి సుబ్బరాజుతో కామెడీ సినిమా తీస్తానంటే ఆడియన్స్ హర్టవుతారేమో.. ఆలోచించుకో రాజమౌళి!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/