ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను: రాజమౌళి

Update: 2021-12-10 10:33 GMT
భారీ చిత్రాలకు .. భారీ విజయాలకు రాజమౌళి కేరాఫ్ అడ్రెస్. ఆయన సినిమాల్లో బలమైన కథ ఉంటుంది .. ఆసక్తికరమైన కథనం ఉంటుంది. ఆ కథలో అనూహ్యమైన మలుపులు ఉంటాయి. ఎక్కడా ఏ పాత్ర కూడా అనవసరంగా కనిపించదు .. ఫలానా సన్నివేశం అనవసరమని అనిపించదు. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత .. ప్రాధాన్యత ఉంటుంది. ఆ పాత్రల నేపథ్యం విషయంలోను .. లుక్స్ విషయంలోను ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అందువల్లనే ఆయన సెట్స్ పైకి వెళ్లిన దగ్గర నుంచి అప్ డేట్స్ తెలుసుకోవడానికి అంతా ఆసక్తిని చూపుతుంటారు.

అలాంటి రాజమౌళి తాజాగా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ ఆర్ ఆర్' రెడీ అవుతోంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక ట్రైలర్ ను వదిలారు. ఎన్టీఆర్ - చరణ్ పాత్రలను ప్రధానంగా చేసుకుని, మిగతా ముఖ్యమైన పాత్రలను టచ్ చేస్తూ వదిలిన ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకువెళుతోంది. ఒక మూడు పవర్ఫుల్ డైలాగ్స్ ఈ ట్రైలర్ లో ఉండేలా చూసుకున్నారు. ఆ డైలాగ్స్ ఈ ట్రైలర్ ను మరింత స్పీడ్ గా ముందుకు తీసుకుని వెళుతున్నాయి.

24 గంటల వ్యవధిలో ఈ ట్రైలర్ 20.4 మిలియన్ వ్యూస్ ను సాధించగా, 1.24 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ ట్రైలర్ కి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం పట్ల రాజమౌళి స్పందించారు. 'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ కి నలుమూలల నుంచి వస్తున్న వస్తున్న రెస్పాన్స్ ను గురించి చెప్పడానికి మాటలు లేవు. ఇంకేమీ చెప్పలేను .. అప్పుడు మా టీమ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటలకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.

'బాహుబలి' సినిమా విడుదలకి ముందు అది అన్నదమ్ముల రాజ్యం కోసం సాగే పోరాటం అనే విషయంలో ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది. కానీ 'ఆర్ ఆర్ ఆర్' విషయానికి వచ్చేసరికి కొమరం భీమ్ - అల్లూరి నేపథ్యం ఆలోచనలో పడేస్తున్నాయి. చరణ్ ఆంగ్లేయ పోలీస్ అధికారిగాను .. అల్లూరిగాను కనిపించడం మరింత కుతూహలాన్ని పెంచుతున్నాయి. అసలు కథ ఏమిటనేది తెలుసుకోవాలనే ఆత్రుత అందరిలో పెరిగిపోతోంది. అజయ్ దేవగణ్ .. అలియా భట్ .. ఒలీవియా .. శ్రియ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా ఏయే విషయాల్లో ఏ స్థాయి రికార్డును సెట్ చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News