'ఆర్.ఆర్.ఆర్' టైటిల్ విషయంలో రాజమౌళి తప్పు చేశాడా..?

Update: 2020-03-29 00:30 GMT
బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ఉగాది కానుకగా రిలీజయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ టైటిల్ గా 'రౌద్రం రణం రుధిరం' ఫిక్స్ చేశారు. అన్ని భాషల్లోనూ టైటిళ్లను రివీల్ చేశారు. టైటిల్ మాత్రమే కాదు ఈ టైటిల్ కు తగినట్టుగా అల్లూరి సీతారామరాజు రౌద్రం చూపిస్తూ నిప్పు కనికగా రామ్ చరణ్ పరుగెత్తుకు వస్తుండగా.. నీటితో రుధిరం అంటూ ఎన్టీఆర్ కనిపించాడు. ఈ ఇద్దరు చేసే రణంగా 'ఆర్.ఆర్.ఆర్' వస్తుంది. అయితే ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ ఈ సినిమా పేరును ఏ పేరుతో పిలవాలనేదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. వాస్తవానికి 'రౌద్రం రణం రుధిరం' అనేది చాలా పెద్దగా ఉన్న టైటిల్. ఇంత పెద్ద టైటిలా అని పెదవి విరిచిన వాళ్ళు కూడా లేకపోలేదు.

ఈ సినిమాను ముందు నుంచి 'ఆర్ఆర్ఆర్' అనే పేరుతో పిలుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక ఈ సినిమాను సంక్షిప్త నామం తో పిలవాల్సిన అవసరం ఉండదని అంతా అనుకున్నారు. కానీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడా ఎవ్వరూ ఈ సినిమాను అసలు పేరుతో పిలవట్లేదు. ఇప్పటికీ 'ఆర్ఆర్ఆర్' అనే అంటున్నారీ చిత్రాన్ని. ఇందుకు కారణమేంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి రివీల్ చేసిన టైటిళ్లు జనాలకు ఎక్కలేదు. 'ఆర్ఆర్ఆర్' అనే అక్షరాలు కలిసొచ్చేలా బలవంతంగా పదాలు ఇరికిస్తూ టైటిళ్లు పెట్టడం.. వివిధ భాషలకు ఒకే టైటిల్ కాకుండా మార్పులు చోటు చేసుకోవడం.. ఆ విషయంలో గందరగోళం ఉండటం.. నార్త్ ఆడియన్స్ కోసం హిందీలో కాకుండా ఇంగ్లిష్‌లో టైటిల్ పెట్టడంతో ఆ పేర్లు వాళ్లకు కనెక్ట్ కావడం లేదు. ఓవరాల్ గా చూస్తే మెజారిటీ జనాలకు టైటిళ్లు నచ్చలేదన్న విషయం అర్థమవుతోంది. సోషల్ మీడియాలో తెలుగు జనాలే కాదు.. మీడియా వాళ్లు కూడా 'ఆర్ఆర్ఆర్' అనే సంక్షిప్త నామాన్ని కొనసాగిస్తూ ఈ సినిమా ముచ్చట్లు చెబుతున్నారు తప్ప ఎవ్వరూ పూర్తి పేరునే ఉపయోగించడం లేదు. దీన్ని బట్టి చిత్ర బృందం టైటిల్ విషయంలో ఫెయిలైందని స్పష్టమవుతోంది. సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో దిట్ట ఐన రాజమౌళి మరి రానున్న రోజుల్లో ఏమి చేస్తాడో చూడాలి.
Tags:    

Similar News