'కాలా' కంటే 11రెట్లు ఎక్కువ‌?

Update: 2018-11-09 06:25 GMT
సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌న్నివేశం టాలీవుడ్ మార్కెట్లో దిగ‌దుడుపుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమాలు గ‌త కొంత‌కాలంగా తెలుగులో డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్‌ తో మార్కెట్ వ‌ర్గాల్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేయ‌డ‌మే అందుకు కార‌ణం. ర‌జ‌నీ ఛ‌రిష్మాకి - అత‌డిపై అభిమానానికి కొద‌వేం లేదు. కానీ ఎంచుకున్న స్క్రిప్టులు - అర‌వ నేటివిటీ మ‌న జ‌నాల‌కు ఏమాత్రం న‌చ్చ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే వ‌రుస వైఫ‌ల్యాలు ఇబ్బంది పెట్టాయి. ర‌జ‌నీ న‌టించిన క‌బాలి - కాలా చిత్రాలు పెద్ద డిజాస్ట‌ర్లుగా నిలిచాయి.

ఆ క్ర‌మంలోనే ర‌జ‌నీకాంత్ న‌టించిన 2.ఓ చిత్రం వాయిదాల ఫ‌ర్వంలో రిలీజ్ కి రావ‌డంతో ఆ ప్ర‌భావం రైట్స్ కొనుక్కున్న వాళ్ల‌పైనా ప‌డింది. అలా ఓసారి ఇచ్చిన అడ్వాన్సులు వెన‌క్కి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏషియ‌న్ సునీల్ నారంగ్ లైకా సంస్థ నుంచి తిరిగి అడ్వాన్సులు వెన‌క్కి తీసుకోవ‌డంతో ఇటీవ‌ల ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.  ఎన్‌.వి.ప్ర‌సాద్ - యువిక్రియేష‌న్స్ వంశీ- దిల్‌ రాజు 2.ఓ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల్ని ఛేజిక్కించుకున్నారు. నైజాంలో దిల్‌ రాజు గుంటూరు- నెల్లూరు ఏరియాకి వంశీ - సీడెడ్‌-ఈస్ట్-వెస్ట్‌ లో ఎన్వీ ప్ర‌సాద్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాకి బిజినెస్ ప‌రంగా ప‌రిశీలిస్తే `కాలా`తో పోలిస్తే ఏకంగా 11రెట్లు అధిక మొత్తాన్ని లైకా సంస్థ‌కు చెల్లించింది ఈ బృందం. దాదాపు 72కోట్ల మేర డీల్ కుదిరితే దానికి జీఎస్టీ - ఇత‌ర‌త్రా ప‌న్నులు క‌లుపుకుని 80కోట్ల‌లో రైట్స్ ఛేజిక్కించుకున్నార‌ని తెలుస్తోంది. కాలా సినిమా 7కోట్ల బిజినెస్ చేసింది. కానీ ఇపుడు తూగో జిల్లాకే 2.ఓ హ‌క్కులు 5.5కోట్లు ప‌ల‌క‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కాలా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయినా 2.ఓ చిత్రానికి ర‌జ‌నీ-శంక‌ర్ కాంబినేష‌న్ అంత హైప్ తేవ‌డంపై మార్కెట్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.
   

Tags:    

Similar News