ఎంతో కష్టపడి.. ఎంతో ఖర్చు పెట్టి ఒక ప్రాడక్ట్ తయారు చేస్తే అది అధికారికంగా రిలీజ్ కావడానికంటే ముందే లీక్ అయిపోతే ఉండే బాధ అంతా ఇంతా కాదు. అందులోనూ ‘బాహుబలి’.. ‘2.0’ లాంటి మెగా ప్రాజెక్టుల విషయంలో ఇలాంటివి జరిగితే బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ రెండు చిత్రాల బృందాలు ఆ బాధను అనుభవించాయి. ‘2.0’ టీజర్ కోసం శంకర్ అండ్ టీం కొన్ని నెలల పాటు కష్టపడింది. కానీ అది అనుకోకుండా ఆన్ లైన్లోకి వచ్చేసింది. డ్యామేజ్ కంట్రోట్ చర్యలు చేపట్టినా చాలా మంది జనాలు ఆ టీజర్ చూసేశారు. ఎలాగూ లీక్ అయింది కదా అని అదే టీజర్ ను అఫీషియల్ గా రిలీజ్ చేయడానికి శంకర్ అంగీకరించలేదు.
టీజర్ లాంచ్ కోసం ప్రత్యేకంగా ఒక భారీ కార్యక్రమం ప్లాన్ చేసిన నేపథ్యంలో హడావుడిగా టీజర్ వదిలేందుకు ఆస్కారం లేకపోయింది. ఈ నేపథ్యంలో మరో టీజర్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈసారి టైం తక్కువగా ఉండటంతో గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండేలా టీజర్ తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఈ నెలలోనే హైదరాబాద్ వేదికగా టీజర్ లాంచ్ చేస్తారట. ఆ తర్వాత బాగా టైం తీసుకుని భారీ స్థాయిలో ట్రైలర్ కట్ చేయాలని అనుకుంటున్నారు. ఇంకా ఈ చిత్ర రిలీజ్ డేట్ ఖరారవ్వలేదు. ఏప్రిల్లో మాత్రం సినిమా రాదని తేలిపోయింది. జులై లేదా ఆగస్టులో సినిమాను విడుదల చేయాలన్న ప్రణాళికతో ఉన్నారట ప్రస్తుతం. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశముంది.